ప్రధాని మోదీ బర్త్ డే, సూరత్ లో 71 అడుగుల పొడవైన కేక్, వాహ్ !

ప్రధాని మోదీ 70 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్ సూరత్ లోని ఓ బేకరీ 71 అడుగుల పొడవైన కేక్ ని తయారు చేసింది. ఇది సుమారు 771 కేజీల బరువు ఉందట..

ప్రధాని మోదీ బర్త్ డే, సూరత్ లో 71 అడుగుల పొడవైన కేక్, వాహ్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 17, 2020 | 8:55 PM

ప్రధాని మోదీ 70 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్ సూరత్ లోని ఓ బేకరీ 71 అడుగుల పొడవైన కేక్ ని తయారు చేసింది. ఇది సుమారు 771 కేజీల బరువు ఉందట.. కరోనా వారియర్స్ థీమ్ తో ఈ భారీ కేక్ ను తయారు చేసినట్టు ఈ బేకరీ నిర్వాహకులు తెలిపారు. కరోనా వారియర్స్ చేస్తున్నసేవలు అమూల్యమైనవని వారు పేర్కొన్నారు. మోడీ బర్త్ డే సందర్భంగా దీన్ని తయారు చేయాలన్న యోచన తమకు ఇటీవలే తట్టిందన్నారు.కాగా బీజేపీ కార్యకర్తలు సేవా సప్తాహ్ పేరిట దేశంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు రేషన్ పంచిపెట్టారు. రక్తదాన శిబిరాలను, కంటి వైద్య క్యాంప్ లను నిర్వహించారు. దేశంలో  మొత్తం 70 చోట్ల వీటిని నిర్వహించినట్టు పార్టీవర్గాలు తెలిపాయి.