ఆఫ్ఘనిస్తాన్‌లో జంట పేలుళ్లు, 17 మంది మృతి, మరో 50 మందికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని బామియన్ నగరంలో మంగళవారం జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

  • Ram Naramaneni
  • Publish Date - 11:16 pm, Tue, 24 November 20
ఆఫ్ఘనిస్తాన్‌లో జంట పేలుళ్లు, 17 మంది మృతి, మరో 50 మందికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని బామియన్ నగరంలో మంగళవారం జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.  టోమి న్యూస్ బామియన్ నగరంలోని స్థానిక మార్కెట్లో పేలుళ్లు సంభవించాయని వెల్లడించింది. అయితే, పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ముఖ్యంగా, బమియాన్ అత్యంత సురక్షితమైన ప్రావిన్సులలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించడం ఇదే తొలిసారి. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రాంతీయ సహకారంపై జరిగిన సమావేశంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘని మాట్లాడుతూ స్థిరమైన శాంతిని నెలకొల్పడానికి బలమైన ప్రాంతీయ ఏకాభిప్రాయం అవసరమని పునరుద్ఘాటించిన సమయంలో ఈ జంట పేలుళ్లు జరగడం సంచలనంగా మారింది.