ఆ ఏడు గ్రామాలు వణికిపోతున్నాయి..

ఇలా ఒక గ్రామంలో జరగడం లేదు. ఏడు గ్రామాల్లో ఇదే పరిస్థితి. సాయంత్రం అయ్యిదంటే చాలు గజగజ వణికిపోతున్నారు. ప్రాణపదంగా చూసుకునే పశువులను కాపాడుకోవడమూ కష్టంగానే మారింది...

ఆ ఏడు గ్రామాలు వణికిపోతున్నాయి..
Follow us

|

Updated on: Aug 10, 2020 | 3:27 PM

ఆ గ్రామాల్లోని ప్రజలు వణికి పోతున్నారు… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ కాలం వెల్లదిస్తున్నారు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి వారిది… సాయంత్రం అయ్యిందంటే చాలు… వ్యవసాయ పనులు వదిలి ఇంటిమొహం పడుతున్నారు. బతికుంటే రేపు చూసుకొవచ్చనుకుంటారు. చికటి పడిందంటే.. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇలా ఒక గ్రామంలో జరగడం లేదు. ఏడు గ్రామాల్లో ఇదే పరిస్థితి. సాయంత్రం అయ్యిదంటే చాలు గజగజ వణికిపోతున్నారు. ప్రాణపదంగా చూసుకునే పశువులను కాపాడుకోవడమూ కష్టంగానే మారింది.

మెదక్ జిల్లా రామాయంపేట అటవీ శివారులో ఉన్న అక్కన్నపేట, తొణిగండ్ల, లక్షపూర్, జన్సీలింగాపూర్, దంతపల్లి,పర్వతపూర్, కాట్రియల ఈ ఏడు గ్రామాల ప్రజలకు చిరుతపులులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎటు వైపు నుండి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. చిరుత దాడిలో ఇప్పటికే 100ల సంఖ్యలో పశువులు, మేకలు మృత్యువాత పడ్డాయి. ఇంకొంతమంది రైతులు చిరుతల దాడిలో గాయపడ్డారు. ఇలా నాలుగు సంవత్సరాలుగా చిరుత పులి దాడులతో ప్రతిరోజు భయపడుతు జీవితం గడుపుతున్నారు.

రామయంపేట అటవీ ప్రాంతంలో గత సంవత్సరం అటవీ అధికారుల లెక్కల ప్రకారం సుమారు 12 చిరుత పులులు ఉన్నాయి.. అయితే వీటిని పట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు వివిధ ప్రయత్నాలు చేసారు.. కానీ ఇప్పటి వరకు ఏదీ సరిగ్గా అమలు కాలేదు. చిరుతను పట్టుకొవడానికి అధికారులు ఎన్ని ఎత్తులు వేసిన, అంతకు పై ఎత్తులు వేసి తప్పించుకుంటున్నాయి. అధికారులు మొక్కుబడిగా కాకుండా కొంచెం సీరియస్ గా విధులు నిర్వహిస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని అంటున్నారు ఆ ఏడు గ్రామాల ప్రజలు.