Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

మీరు నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా?

అందంగా కనిపించాలని, అంతా మిమ్మల్నే చూడాలని, మీ అందాన్ని అంతా పొగడాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేసి చూడండి. మనం కాలుష్యం మధ్య జీవిస్తున్నామనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. యవ్వనదశలోనే నాలుగు పదుల వయసు పైబడినట్టుగా కొంతమంది కనిపిస్తుంటారు. దీనికి కారణాలు అనేకం కావచ్చు. కొన్ని ఆనారోగ్య సమస్యలైతే.. మరికొన్ని మానసిక సమస్యలు. అయితే చేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కూడా మరొకటి. ముఖ్యంగా దేహా రక్షణకు తగినంత సమయాన్ని కేటాయిస్తే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కేవలం పది సూత్రాలను పాటిస్తే చాలు. కొంతలో కొంత మార్పు గమనించవచ్చు.

1. తగినంత నిద్రపోండి
కంటినిండా నిద్రపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు మీ దరికి రావడానికి భయపడతాయి. కనీసం 6 -8 గంటలు నిద్రపోవాలి. ఈ విధంగా నిద్రపోవడం అలవాటు చేసుకుంటే శరీరంలో ఉన్న మెటబాలిజంలో మార్పులు వచ్చి.. దేహం కళకళలాడుతుంది.

2. మార్నింగ్ వాకింగ్ ఎంత మంచిదో తెలుసా?
ఉదయం లేవడంతోనే వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా నడకతో శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ క్రమబద్దంగా సాగుతుంది. బీపీ, డయాబెటీస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా మార్నింగ్ వాకింగ్‌తో అన్ని అవయవాలకు అందాల్సిన శక్తి అందుతుంది. ప్రతిరోజు అరగంట సేపు వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో ఉన్న కండరాలకు శక్తి, పుష్టి రెండూ వస్తాయి. తద్వారా మరింత ఆరోగ్యంగా కూడా ఉంటారు. ముఖ్యంగా ఎముకలు పటుత్వం పెరుగుతుంది.

3. పండ్లను తినడం మర్చిపోవద్దు
ఆహారాన్ని క్రమం తప్పకుండా తింటున్నాం కదా అని పండ్లను తినడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తాజా పండ్లను తినడం ద్వారా శరీరంలో రక్తపుష్టి పెరుగుతంది. దాంతో పాటు తగినన్ని విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి.

4. తగింతగా నీరు తాగండి
పనిలో పడి మంచినీటిని తాగడం మర్చిపోతుంటారు చాలమంది. ఇది చాల ప్రమాదకరం. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటకు పంపడానికి నీరు ఎంతో సహకరిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో 70 శాతం నీటితోనే నిండి ఉందనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. తగినంత నీటిని దేహానికి అందించకపోతే డీహైడ్రేషన్ ఏర్పడి చర్మం తమ సహజత్వాన్ని కోల్పోతుంది. అందుకని కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం అలవాటుగా మార్చుకోవాలి.

5. ఎండనుంచి రక్షించుకోవాలి
ఎండ బాగుంది కదా అని బయటకు వెళితే .. సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత కిరణాలు మన శరీరంపై నేరుగా దాడి చేస్తాయి. దీనివల్ల చర్మం నల్లగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ కిరణాలనుంచి రక్షింపబడాలంటే ఖచ్చితంగా మంచి సన్ స్క్రీన్ లోషన్ వంటిది రాసుకుని వెళ్లాలి. ఇది దేహాన్నిసూర్య కిరణాలనుంచి కాపాడుతుంది.

6. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి
ఆధునిక జీవితంలో మనిషి జీవితాన్ని ఒత్తడి డామినేట్ చేస్తూనేఉంది. దీన్ని అధిగమించాలి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికి మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి ప్రయత్నించండి. దీనివల్ల దాదాపుగా ఎన్నో సమస్యలు పరిష్కరించబతాయి.

7. వీలైనంత శాఖాహారిగా మారితే మంచిది
శరీరానికి తగినన్ని విటమిన్లు, ప్రోటీన్లను అందించడంలో ఆకుకూరలు, కూరగాయల పాత్ర ఎంతో ఉంది. ఆకుపచ్చని కూరగాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సీ వంటివి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.