Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

‘సెవెన్’ తెలుగు మూవీ రివ్యూ

Seven Telugu Movie Review, ‘సెవెన్’ తెలుగు మూవీ రివ్యూ

టైటిల్ : ‘7’

తారాగణం : హవీష్, రెజీనా కసాండ్ర, త్రిథా చౌదరీ, పూజితా పొన్నాడ, రెహ్మాన్ తదితరులు

సంగీతం : చైతన్ భరద్వాజ్

దర్శకత్వం : నిజార్ షఫీ

కథ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ : రమేష్ వర్మ

విడుదల తేదీ: 06-06-2019

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ నిర్మించిన చిత్రం ‘7’. పూర్తి కమర్షియల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రెజీనా, త్రిథా చౌదరీ, అదితి ఆర్య, నందితా శ్వేతా, అనీషా అంబ్రోస్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. సస్పెన్స్‌కు పెద్ద పీట వేసిందంటూ వచ్చిన అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలిగిందో చూద్దాం.

కథ‌ :

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కార్తీక్ (హవీష్).. తన కంపెనీలో సహద్యోగి రమ్య(నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఓ రోజు రమ్య తన భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అదే తరుణంలో రమ్య మాదిరిగానే జెన్నీ(అనీషా అంబ్రోస్), ప్రియా(త్రిథా చౌదరీ)లు కూడా తమ భర్తలు కనిపించట్లేదని ఫిర్యాదు చేస్తారు. ఇక ఆ క్రమంలో సిటీలో జరిగే వరుస హత్యలు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారతాయి. ఈ హత్యల వెనుక హస్తం ఎవరిది.? హత్యలన్నీ కార్తీక్ చేస్తున్నాడా.? అసలు మధ్యలో ఈ కృష్ణమూర్తి ఎవరు.? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు :

సినిమాకి ప్రధాన బలం హీరోయిన్ రెజీనా కసాండ్ర. మిగిలిన హీరోయిన్స్ అందరిని డామినేట్ చేస్తూ చక్కని నటనకనబరిచింది. ప్రేమ కోసం తహతహలాడే అమ్మాయి పాత్రలో అక్కడక్కడా నెగటివ్ షేడ్స్ చూపిస్తూ రెజీనా తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక హీరో హవీష్ విషయానికి వస్తే.. సినిమాలోని అతని లుక్, మేకోవర్ బాగుంది. కానీ ఇంటెన్స్, ఎమోషనల్ సీన్స్ వచ్చేసరికి పూర్తిగా తేలిపోయాడు. నటన పరంగా మరింత పరిణితి చెందాల్సి ఉంది. రెజీనా తర్వాత నందిత శ్వేత కొంతలో కొంత తన పాత్రను రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించింది. త్రిథా చౌదరీ అదితి, పూజితా పొన్నాడ పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేష‌ణ‌ :

సెవెన్ కథలో బలం ఉన్నప్పటికీ.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడిగా విఫలమైనట్లే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం సస్పెన్స్ పెట్టి.. సెకండాఫ్ కి వచ్చేసరికి పూర్తిగా తేలిపోయేలా చేశాడు. నటీనటుల సెలక్షన్ కూడా సినిమాకు మరో మైనస్ పాయింట్ గా మారింది. క్లైమాక్స్ సన్నివేశాలు నాసిరకంగా ఉండడం వల్ల సినిమాకు మరింత డామేజ్ ఏర్పడింది.

సాంకేతిక విభాగాల పనితీరు:

దర్శకుడిగా కంటే సినిమాటోగ్రాఫర్ గా నిజార్ షఫీ సఫలమయ్యాడనే చెప్పాలి. ఎడిటింగ్, సంగీతం, ఇతర సాంకేతిక విభాగాల పనితీరు యావరేజ్ గా ఉన్నాయి. అటు నిర్మాతగా మారిన దర్శకుడు రమేష్ వర్మ ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే మాత్రం బెడిసికొట్టింది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

కథ, సినిమాటోగ్రఫీ

కొన్ని ట్విస్టులు

 

మైనస్‌ పాయింట్స్‌ :

స్క్రీన్ ప్లే

నటీనటుల పెర్ఫార్మన్స్

లాజిక్ లేని సీన్స్