లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయుల విడుదల

గత నెలలో లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయులు క్షేమంగా విడుదలయ్యారని విదేశాంగ వ్యవహారాల మంతిత్వ శాఖ తెలిపింది. ఏపీ, బీహార్, గుజరాత్, యూపీ రాష్ట్రాలకు చెందిన వీరు సెప్టెంబరు 14 న లిబియాలోని యాష్ వెరీఫ్ వద్ద కిడ్నాప్ కి గురయ్యారు. ఇందుకు కారణాలు తెలియలేదు. ఇండియాకు వెళ్లే విమానం ఎక్కేందుకు ఈ ఏడుగురూ ట్రిపోలీ విమానాశ్రయానికి బయల్దేరగా మధ్యలో కొందరు వ్యక్తులు వీరిని కిడ్నాప్ చేశారు. వీరు లిబియాలోని కన్ స్ట్రక్షన్ అండ్ ఆయిల్ […]

లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయుల విడుదల
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2020 | 5:40 PM

గత నెలలో లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయులు క్షేమంగా విడుదలయ్యారని విదేశాంగ వ్యవహారాల మంతిత్వ శాఖ తెలిపింది. ఏపీ, బీహార్, గుజరాత్, యూపీ రాష్ట్రాలకు చెందిన వీరు సెప్టెంబరు 14 న లిబియాలోని యాష్ వెరీఫ్ వద్ద కిడ్నాప్ కి గురయ్యారు. ఇందుకు కారణాలు తెలియలేదు. ఇండియాకు వెళ్లే విమానం ఎక్కేందుకు ఈ ఏడుగురూ ట్రిపోలీ విమానాశ్రయానికి బయల్దేరగా మధ్యలో కొందరు వ్యక్తులు వీరిని కిడ్నాప్ చేశారు. వీరు లిబియాలోని కన్ స్ట్రక్షన్ అండ్ ఆయిల్ ఫీల్డ్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులని, ప్రస్తుతం అంతా ఆరోగ్యంగా ఉన్నారని ట్యునీషియా లోని భారత రాయబారి పునీత్ రాయ్ కుండల్ తెలిపినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ చెప్పారు. త్వరలో వీరు ఇండియాకు తిరిగి రానున్నట్టుఆయన పేర్కొన్నారు.