బ్రేకింగ్ : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. ఏడుగురు ఎంపీలు సస్పెండ్.!

తాజాగా ఢిల్లీలో జరిగిన అల్లర్లపై పార్లమెంట్‌లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అల్లర్ల అంశాన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. సభలో పెద్ద ఎత్తున గందరగోళం సృష్టిస్తూ.. అనైతికంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సస్సెండ్‌కు గురైన ఎంపీల్లో గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, దియాన్ కుర్యాకోస్, ఆర్ ఉన్నితన్, మాణిక్ ఠాగూర్, బెన్ని […]

బ్రేకింగ్ : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. ఏడుగురు ఎంపీలు సస్పెండ్.!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 4:25 PM

తాజాగా ఢిల్లీలో జరిగిన అల్లర్లపై పార్లమెంట్‌లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అల్లర్ల అంశాన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. సభలో పెద్ద ఎత్తున గందరగోళం సృష్టిస్తూ.. అనైతికంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు.

సస్సెండ్‌కు గురైన ఎంపీల్లో గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, దియాన్ కుర్యాకోస్, ఆర్ ఉన్నితన్, మాణిక్ ఠాగూర్, బెన్ని బెహ్నన్, గుర్జిత్ సింగ్‌లు ఉన్నారు. వీరంతా ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు హాజరుకాకుండా.. స్పీకర్ వేటు వేశారు.సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు.. పేపర్లను చించి.. లోక్‌సభ స్పీకర్‌ కుర్చీపై విసరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

కాగా తమ సభ్యులను సస్పెండ్ చేసింది.. స్పీకర్ నిర్ణయంతో కాదని.. ఇది ప్రభుత్వ నిర్ణయమని లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ ఆరోపించారు.