Breaking News
  • టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్.
  • కర్ణాటకలో కరోనాకు బలవుతున్న ప్రజాప్రతినిధులు. ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రావు మృతి. కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యే. నిన్న మృతిచెందిన కేంద్ర మంత్రి సురేశ్ అంగాడి. అంగాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెలగావి (బెలగాం) కూడా కర్ణాటకలోనే అంతకు ముందు కర్ణాటక బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ మృతి.
  • ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కి కోరిన పాజిటివ్. నిన్నటి నుండి బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి.
  • ఏసీబీ అధికారులకు మాజీమంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు. మంత్రి జయరాంపై ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు, వెలగపూడి. మంత్రి జయరాం, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేశాం. ఆధారాలుంటే చూపించండి రాజీనామా చేస్తామని జయరాం అన్నారు. అన్ని ఆధారాలు చూపించా-మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఏసీబీ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంది. న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం-అయ్యన్నపాత్రుడు.
  • సినీ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు సమన్లు. నోటీసులు అందుకున్నట్టు వెల్లడించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌. రేపు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరుకానున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌పై ఆరోపణలు.
  • కడప: కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నేతల నిరసన. సీఎం జగన్‌ ప్లాన్‌ ప్రకారమే అంతా నడుస్తోంది. జగన్‌ మౌనంగా ఉంటూ ఆనందిస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి, కొడాలి నాని వెంటనే రాజీనామా చేయాలి. -మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.
  • మహారాష్ట్ర: భివాండిలో భవనం కూలిన ఘటనలో 41కి చేరిన మృతుల సంఖ్య. ఘటనా స్థలంలో పూర్తయిన సహాయక చర్యలు.

విజయ్‌ ‘సేతుపతి 2’ రంగం సిద్ధమా?

, విజయ్‌ ‘సేతుపతి 2’ రంగం సిద్ధమా?

కోడంబాక్కం: కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి స్టైలే డిఫరెంట్. పాత్ర నచ్చితే చాలు…వయసు, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా నటించేస్తుంటాడు సేతుపతి. అందుకే అతి వేగంగా 25 సినిమాల్లో నటించి భారీ ఫ్యాన్ బేస్‌ను సెట్ చేసుకున్నాడు. ఆయన నటించిన సినిమాలన్నీడిఫరెంట్‌గా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పిజ్జా, నడువుల కొంజం పక్కత్తకానోం, సూదుకవ్వుం, ఇదర్కుతానే ఆశపట్టాయ్‌ బాలకుమారా, సేతుపతి, విక్రంవేదా.. వంటి పలు చిత్రాలు విజయ్‌ సేతుపతికి బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. అంతేకాకుండా వీటి సీక్వెల్‌ చిత్రాల కోసం ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘ఇదక్కుతానే ఆశపట్టాయ్‌ బాలకుమారా’ సీక్వెల్‌లో నటించాలనే తన కోరికను ఇటీవల బయట పెట్టారు విజయ్‌ సేతుపతి.

అయితే వాటన్నింటికన్నా ముందుగా తొలిసారి ఓ పోలీసు అధికారిగా నటించిన ‘సేతుపతి’ సినిమా సీక్వెల్‌ మాత్రం తెరకెక్కనున్నట్లు తమిళ ఫిలిం వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలోని ఈ సినిమా రెండో భాగం చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. తొలి భాగం కన్నా పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా విజయ్‌సేతుపతి కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.

Related Tags