తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

మియపూర్ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మియపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రద్దు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు.. దీనిపై స్టే విధించింది హైకోర్టు. మియపూర్ భూములను యథావిథిగా ఉంచాలని స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. కోర్టులో పరిష్కారం అయ్యేంత వరకు మియపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ, […]

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
Follow us

|

Updated on: Apr 16, 2019 | 2:28 PM

మియపూర్ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మియపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రద్దు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు.. దీనిపై స్టే విధించింది హైకోర్టు. మియపూర్ భూములను యథావిథిగా ఉంచాలని స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. కోర్టులో పరిష్కారం అయ్యేంత వరకు మియపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ, ప్రైవేటు వ్యక్తులు అమ్మడం కానీ చేయకూడదని వెల్లడించింది. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారి పట్ల కోర్టుకు సానుభూతి ఉండదని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది .