మాస్కుల వ్యర్ధాలతో.. పర్యావరణానికి తీవ్ర హాని..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ కట్టడికోసం మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది. కరోనా  కట్టడికి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది,

  • Tv9 Telugu
  • Publish Date - 6:05 pm, Thu, 16 July 20

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ కట్టడికోసం మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది. కరోనా  కట్టడికి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారవర్గాలతోపాటు సాధారణ ప్రజలుమాస్కులను తప్పనిసరిగా ధరిస్తున్నారు. వీటిల్లో మెడికల్‌ మాస్కులు అయిన ఎన్‌95 మాస్కులు, సర్జికల్‌ మాస్కులతోపాటు పలు రకాలున్నాయి.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 10 కోట్ల మాస్కులు వాడుతున్నారు. దేశంలో సగటున రోజుకు దాదాపు 25 లక్షల మెడికల్‌ మాస్కులు వినియోగిస్తున్నట్లు భారత వైద్య మండలి(ఎంసీఐ) అంచనా వేసింది. మన రాష్ట్రంలో రోజుకు దాదాపు 1.20 లక్షల మెడికల్‌ మాస్కులు వాడుతున్నారు. మాస్కుల వ్యర్థాల నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా కత్తిమీద సాముగా మారింది.

డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ప్రభుత్వ సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యర్థాలపై నిబంధనలు విధానాలు నిర్దేశించాయి. ఎందుకంటే.. కోవిద్-19 వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకుంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఈ ఏడాది 130 బిలియన్ల మాస్కుల వ్యర్థాలు సముద్రంలో చేరతాయని శాస్త్రవేత్తలు  అంచనా వేస్తుండటం పరిస్థితి తీవ్రతకునిదర్శనం. అదే జరిగితే సముద్ర జలాల్లోజెల్లీఫిష్‌ల కంటే మాస్కుల వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.