పనిమనిషి చేతివాటం..చేరిన గంటలోనే ఇల్లు గుల్ల…!

ఇంట్లో పనిచేసేందుకు మీరు ఓ పనిమనిషి కావాలనుకుంటున్నారా..? కొత్తగా పని మనిషిని ఇంట్లో చేర్చుకునే వారు ముందుగా ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంట్లో పని చేస్తాను అని చెప్పి…

  • Jyothi Gadda
  • Publish Date - 5:16 pm, Mon, 26 October 20

ఇంట్లో పనిచేసేందుకు మీరు ఓ పనిమనిషి కావాలనుకుంటున్నారా..? కొత్తగా పని మనిషిని ఇంట్లో చేర్చుకునే వారు ముందుగా ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంట్లో పని చేస్తాను అని చెప్పి… ఇంట్లోకి వెళ్లి పని ప్రారంభించిన గంటల్లోనే డబ్బు, బంగారం, ఇంకా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో ఉడాయించే ఓ ‘సీరియల్’ దొంగను ఇటీవల ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

అక్టోబర్ 19 న, వనితా గైక్వాడ్ అనే మహిళ బాంద్రాలోని ఒక వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. అతగి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల నుండి సిసిటివి ఫుటేజ్ సహాయంతో 34 ఏళ్ల మహిళను గుర్తించారు. పోలీసులు. ఆమెను పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పని చేస్తాను అని చెప్పి… ఇంట్లోకి వెళ్లి పని ప్రారంభించిన గంటల్లోనే ఆ మహిళ తన యజమాని ఇంట్లోని డబ్బు, బంగారం, విలువైన వస్తువులతో ఉడాయిస్తుందని పోలీసులు తేల్చారు. నిందితురాలి వద్ద నుంచి దొంగిలించబడిన నగదు, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇకపోతే, సదరు మహిళ 1990 నుండి కనీసం 44 నేరాలకు పాల్పడిందని… ఆమెను ఇప్పటి వరకు అన్ని ప్రాంతాలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరిలో శాంటాక్రూజ్‌ లోని ఒక ఫ్లాట్‌లో పనిచేయడం ప్రారంభించిన రెండు గంటల్లోనే రూ .5.3 లక్షల నగలు దొంగిలించినందుకు ఆమెను గతంలోనే అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు.