మోదీ స్వరాష్ట్రంలో కుల వివక్ష.. దళిత టీచర్‌కు అవమానం

కులం.. ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న భూతం. ఈ కులజాఢ్యం ప్రస్తుతం దేశంలో మరింత పెరిగిపోతోంది. ఇటీవల అగ్రవర్ణాల భూమి నుంచి దళితుడి శవం కూడా పొవడానికి వీల్లేదంటూ తమిళనాడులో జరిగిన కుల దుశ్చర్య మరిచిపోకముందే.. మరో కుల వివక్ష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మరెక్కడో కాదండోయ్.. సాక్షాత్తు మన దేశ ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌లో.. చాయ్ వాలా నుంచి ప్రధానిగా ఎదిగానని మన మోదీ చెప్తుంటారు. అంతేకాదు ఆ రాష్ట్రానికి సీఎంగా కూడా […]

మోదీ స్వరాష్ట్రంలో కుల వివక్ష.. దళిత టీచర్‌కు అవమానం
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 6:11 PM

కులం.. ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న భూతం. ఈ కులజాఢ్యం ప్రస్తుతం దేశంలో మరింత పెరిగిపోతోంది. ఇటీవల అగ్రవర్ణాల భూమి నుంచి దళితుడి శవం కూడా పొవడానికి వీల్లేదంటూ తమిళనాడులో జరిగిన కుల దుశ్చర్య మరిచిపోకముందే.. మరో కుల వివక్ష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మరెక్కడో కాదండోయ్.. సాక్షాత్తు మన దేశ ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌లో.. చాయ్ వాలా నుంచి ప్రధానిగా ఎదిగానని మన మోదీ చెప్తుంటారు. అంతేకాదు ఆ రాష్ట్రానికి సీఎంగా కూడా చాలా ఏళ్లు వ్యవహరించారు. దేశానికి రోల్ మోడల్ గుజరాత్ అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే అక్కడ ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే షాక్ తినాల్సిందే. ఎవరైన విద్యార్ధులు కుల వివక్ష గురించి ప్రస్తావిస్తే.. అది తప్పూ అని గురువు చెప్పాలి. మరి ఆ గురువే కుల వివక్షకు గురైతే ఎవరికి చెప్పాలి. ఇలాంటి ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో ఓ దళిత టీచర్‌కు ఎదురైంది.

సురేంద్రనగర్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో రెండు మంచి నీటి కుండలను ఏర్పాటు చేయించాడు ప్రధానోపాధ్యాయుడు. అందులో ఒకటి అగ్ర కులాలకు చెందిన టీచర్లకు, మరొకటి దళిత టీచర్‌కు. అయితే పొరపాటున దళిత టీచర్‌.. అగ్ర కులాలకు ఏర్పాటు చేయించిన మంచి నీటి కుండను ముట్టుకున్నారు. దీంతో ఆ ప్రధానోపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సదరు ఉపాధ్యాయుడిపై మండిపడ్డారు. అయితే ఈ ఘటనపై ఆ బాధిత టీచర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం పాఠశాలలో రెండు మంచినీటి కుండలు ఏర్పాటు చేశారని, ఒకటి అగ్రవర్ణాలకు, మరొకటి ఇతరులకు కేటాయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను పొరపాటున అగ్రవర్ణాలకు చెందిన కుండలోని నీటిని తాగానని, దీంతో తనకు హెచ్ఎం నోటీసు జారీ చేశారన్నారు. కాగా ఈ ఘటన జరిగిన తరువాత ఆ భాధిత ఉపాధ్యాయుడిని వేరొక పాఠశాలకు బదిలీ చేయడం గమనార్హం. అగ్రదేశాలతో పోటీపడుతున్నామనుకుంటున్న తరుణంలో ఇలాంటి అనాగరిక చర్యలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..