సియోల్ మేయర్ అనుమానాస్పద మృతి

దక్షిణ కొరియాలోని సియోల్ నగర మేయర్ పార్క్ వన్ సూన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. చాలాకాలంపాటు సియోల్ నగర మేయరుగా పనిచేసిన పార్క్ తప్పిపోయినట్లు అతని కుమార్తె ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే అతని మృతదేహం ఉత్తర సియోల్ లోని మౌంట్ బుగాక్ వద్ద పోలీసులు కనుగొన్నారు.

సియోల్ మేయర్ అనుమానాస్పద మృతి
Follow us

|

Updated on: Jul 10, 2020 | 11:02 AM

దక్షిణ కొరియాలోని సియోల్ నగర మేయర్ పార్క్ వన్ సూన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. చాలాకాలంపాటు సియోల్ నగర మేయరుగా పనిచేసిన పార్క్ తప్పిపోయినట్లు అతని కుమార్తె ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే అతని మృతదేహం ఉత్తర సియోల్ లోని మౌంట్ బుగాక్ వద్ద పోలీసులు కనుగొన్నారు. మేయర్ పార్క్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా డెడ్ బాడీని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మేయర్ పార్క్ మృతదేహం సమీపంలో అతని ఫోన్ సిగ్నల్ చివరిగా కనుగొన్నామని సియోల్ మెట్రోపాలిటన్ పోలీసు ఏజెన్సీ వెల్లడించింది. మేయర్ పార్క్ కుమార్తె గురువారం సాయంత్రం తన తండ్రి తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మేయరు పార్క్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మేయర్ పార్క్ మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని సియోల్ నగర పోలీసులు చెప్పారు.

మేయర్ పార్క్ ప్రజాధారణ కలిగిన నేతగా ఎదిగారు. సియోల్ నగరానికి ఎక్కువ కాలం మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. కోటి జనాభా కలిగిన సియోల్ నగరానికి పార్క్ అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపుపొందారు. తాజాగా కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర పోషించి ప్రజల మెప్పు పొందారు. 2022లో జరగనున్న కొరియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీదారుగా ఉన్నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. మరోవైపు, పార్క్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని మాజీ సెక్రటరీ ఈ మధ్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్క్ మృతిని సీరియస్ గా తీసుకున్న సియోల్ నగర పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్