స్టాక్ మార్కెట్లో జోరు… లాభాల హోరు!

Sensex Surges 1100 Points Nifty Crosses 11600, స్టాక్ మార్కెట్లో జోరు… లాభాల హోరు!

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల మధ్య గత వారం భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు సోమవారం కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి.  బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 1,127 పాయింట్ల లాభంతో 39,141 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 334 పాయింట్లు లాభపడి 11,608 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.93 వద్ద కొనసాగుతోంది.

బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. రిలయన్స్‌ క్యాపిటల్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టీసీఎస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. ఐటీ మినహా మిగతా రంగాల షేర్లన్నీ లాభాల్లో నమోదవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *