స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఆద్యంతం ఒడిదొడుకుల్లో సాగినప్పటికీ… చివరకు తేరుకుని స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో ముగిసింది. దేశీయ, అంతర్జాతీయ సానుకూల పరిస్థితులతో పాటు విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఈ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ దాదాపు 100 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 11,900 పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. […]

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Follow us

| Edited By: Srinu

Updated on: May 28, 2019 | 8:06 PM

దేశీయ మార్కెట్లు ఆద్యంతం ఒడిదొడుకుల్లో సాగినప్పటికీ… చివరకు తేరుకుని స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో ముగిసింది. దేశీయ, అంతర్జాతీయ సానుకూల పరిస్థితులతో పాటు విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఈ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ దాదాపు 100 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 11,900 పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఒక దశలో నష్టాల్లో సాగాయి. అయితే చివరి గంటల్లో ఐటీ, లోహ రంగాల షేర్ల కొనుగోళ్లతో సూచీలు మళ్లీ కోలుకున్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడి 39,750 వద్ద, నిఫ్టీ కేవలం 4 పాయింట్ల లాభంతో 11,929 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.70గా కొనసాగుతోంది.