నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sensex falls 286 points, నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతోనే ముగిశాయి.ఆర్‌బీఐ 35బేసిస్‌ పాయింట్ల మేరకు రేపొరేటును తగ్గించినా మదుపరుల్లో నమ్మకాన్ని మాత్రం పెరగలేదు. సెన్సెక్స్‌ 286 పాయింట్లు నష్టపోయి 36,690 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 10,838 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.

నిఫ్టీ బ్యాంక్‌, ఆటో, రియాల్టీ సూచీలు 1-2శాతం వరకు విలువ కోల్పోగా మహీంద్రా అండ్‌ మహీంద్ర షేర్లు ఐదేళ్ల కనిష్టానికి చేరుకొన్నాయి.  26శాతం లాభాలు తగ్గినట్లు కంపెనీ ఫలితాలు ప్రకటించడంతో ఈ షేర్లను మదుపరులు విక్రయించారు. టైటాన్‌ కంపెనీ షేర్లు ఆరునెలల కనిష్టంలో ట్రేడ్‌ అయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 4శాతం విలువ కోల్పోయాయి. ఇటీవల ప్రకటించిన త్రైమాసికంలో ఆశించన స్థాయిలో లాభాలు ప్రకటించకపోవడంతో మదుపరులు భారీగా విక్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *