Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 58 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి నేడు రెండో రోజు మహానాడు కార్యక్రమం. ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్న రెండో రోజు మహానాడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించనున్న టీడీపీ.
  • తిరుమల: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. లాక్ డౌన్ దృష్డ్యా మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనునన్న టీటీడీ బోర్డు సమావేశం. పది గంటలకు ప్రారంభం కానున్న సమావేశం. సిస్కో వెబ్ ఎక్స్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొననున్న బోర్డు సభ్యులు. 60 అంశాలతో ఎజెండా. నిరరార్ధక ఆస్తుల వేలం తీర్మానంపై కీలకంగా చర్చించనున్న బోర్డు. ప్రభుత్వ అదేశాలనంతరం భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి సదుపాయాల కల్పన విధివిధానాలపై చర్చించనున్న పాలకమండలి టీటీడీ ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం.
  • ఎన్టీఆర్ 97 వ జయంతి సందర్భంగా ఎన్టిఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన బాలకృష్ణ దంపతులు , సుహాసిని.
  • అమరావతి హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసు ఏడుగురు పై కేసులు నమోదు చేసిన సీఐడీ.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు. విచారణకు హాజరు కావాలని పలువురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ..
  • హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది. షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
  • కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇవాళ 107 పాజిటివ్ కేసులు నమోదు. * సౌదీ అరేబియా 49, వలస కార్మికులు 19 పాజిటివ్ కేసులు నమోదు. ఇవ్వాళ కొత్తగా 6మంది మృతి. ఇప్పటి వరకు మొత్తం 64కి చేరిన మృతుల సంఖ్య. ఇవాళ 37 మంది డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి. ఇప్పటి వరకు 1321 మంది డిశ్చార్జి.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Sensex, భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 11,945 వద్ద, సెన్సెక్స్‌ 329 పాయింట్లు పెరిగి 39,831 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. మార్కెట్‌ను ముఖ్యంగా బ్లూచిప్‌ కంపెనీల షేర్లు నడిపించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ల షేర్లు లాభపడంతో సూచీలు కూడా పరుగులు తీశాయి. దీంతో సూచీలు నిఫ్టీలో కీలకమైన 11,950 మార్కును దాటాయి. టెలికమ్‌, ఎనర్జీ, ఐటీ, నిత్యావసరాలు, విద్యుత్తు, ఫైనాన్స్‌ రంగాలు బాగా లాభపడ్డాయి. నిఫ్టీలో అత్యధికంగా ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. దాదాపు 3.2శాతం పెరిగి రూ.135కు చేరాయి. ఆ తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, యస్‌బ్యాంక్‌, భారత్‌ పెట్రోలియం, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఎల్‌లు ఉన్నాయి. సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐషర్‌ మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి.

Related Tags