వరంగల్ కోర్టు సంచలన తీర్పు.. తొమ్మిది మందిని చంపిన సంజయ్ కి ఉరిశిక్ష

వరంగల్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

వరంగల్ కోర్టు సంచలన తీర్పు.. తొమ్మిది మందిని చంపిన సంజయ్ కి ఉరిశిక్ష
Follow us

|

Updated on: Oct 28, 2020 | 2:25 PM

వరంగల్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. వరంగల్ జిల్లా గొర్రెకుంటలో తొమ్మిదిమందిని జలసమాధి చేసిన మానవ మృగం సంజయ్ కుమార్ యాదవ్ కి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడి చేశారు జిల్లా సెషెన్స్ జడ్జ్ జయకుమార్. గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసినట్టుగా నిందితుడు సంజయ్ కుమార్ కోర్టులో ఒప్పుకొన్నాడు. దీనిపై విచారణ జరిపిన వరంగల్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. నిందితుడికి శిక్ష పడటం పట్ల జిల్లా బార్ అసోసియేషన్, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

వరంగల్: తెలంగాణలో సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది మే 20న వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట బావిలో 9మందిని హత్య చేసిన కేసులో విచారణ పూర్తయింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నిందితుడిపై అభియోగాలను నిరూపించడంతో ఉరిశిక్ష ఖరారు చేస్తూ వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జయకుమార్‌ తీర్పు వెల్లడించారు. నిందితుడిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తొమ్మిది మందిని హత్య చేయడాన్నిసీరియస్ గా తీసుకున్న వరంగల్ జిల్లా పోలీసులు.. సంఘటన జరిగిన నెల రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ హత్యలను కాల్‌ డేటా రికార్డింగ్‌ ఆధారంగానే పోలీసులు కేసును ఛేదించారు. వరంగల్ నగర శివారులో గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్‌, అతడి భార్య పనిచేసేవారు. ఈ క్రమంలోనే బిహార్‌కు చెందిన సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజీవ్‌ దగ్గరయ్యాడు. అనంతరం గీసుకొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. అయితే, తన కుమార్తెతో కూడా నిందితుడు చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్‌ను మందలించింది. పలుమార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజీవ్‌ యాదవ్‌ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్‌ రథ్‌ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లలో నిద్రమాత్రలు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో రైల్లోంచి తోసేశాడు. అనంతరం తిరిగి గీసుకొండ చేరుకున్నాడు. అయితే, తన అక్క కూతురు గురించి మక్సూద్‌ భార్య నిషా నిలదీసింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్‌ కుటుంబాన్ని కూడా హతమార్చాలని టార్గెట్‌ పెట్టుకున్నాడు.

ఇదే క్రమంలో మే 16 నుంచి 20వ తేదీ వరకు రోజూ వారు పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రానికి నిత్యం వచ్చేవాడు. చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించాడు. మే 20వ తేదీన మక్సూద్‌ మొదటి కుమారుడైన షాబాజ్‌ పుట్టిన రోజు అని తెలుసుకుని ఆ రోజే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 18వ తేదీన వరంగల్‌ చౌరస్తాలో ఓ మెడికల్‌ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 20వ తేదీ రాత్రి వారితో ముచ్చటించాడు. అనుకూలంగా ఉన్న సమయంలో మక్సూద్‌ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న ఎండీ మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), బుస్ర కుమారుడు(3), షాబాద్‌(22), సోహైల్‌(20), బిహార్‌కు చెందిన కార్మికులు శ్యామ్‌(22), శ్రీరామ్(20), వరంగల్‌ వాసి షకీల్ ను గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు.

ఈకేసును సవాల్ గా స్వీకరంచిన అప్పటి వరంగల్ పోలీసు కమిషనర్ రవీంద్రనాథ్ మొత్తం ఈ కేసు ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లోంచి వెళ్లడం దగ్గర నుంచి మళ్లీ చేరుకునే వరకు అందులో నమోదయ్యాయి. దీంతో నిందితుడిని జాన్‌పాక్‌లోని తన ఇంటిలో అదుపులోకి తీసుకున్నామని అని రవీందర్‌ వెల్లడించారు.

చివరికి సంజయ్ కుమార్ కు ఉరిశిక్ష పడటం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు, లాయర్లు పరస్పరం స్వీట్స్ పంచుకుని సంబురాలు జరుపుకున్నారు.

'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.