కుల్‌భూషణ్‌ జాధవ్‌ను కలిసిన భారత రాయబారి

మరణశిక్ష పడి పాక్‌ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌(49)ను భారత సీనియర్‌ దౌత్యాధికారి ఒకరు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జాధవ్‌తో భారత దౌత్యాధికారి కాసేపు చర్చించారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు కుల్‌భూషణ్‌ జాధవ్‌ను సెప్టెంబర్‌ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్‌ ఫైసల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాన్సులర్‌ అనుమతి లభించడంతో ఓ భారత […]

కుల్‌భూషణ్‌ జాధవ్‌ను కలిసిన భారత రాయబారి
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 8:52 PM

మరణశిక్ష పడి పాక్‌ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌(49)ను భారత సీనియర్‌ దౌత్యాధికారి ఒకరు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జాధవ్‌తో భారత దౌత్యాధికారి కాసేపు చర్చించారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు కుల్‌భూషణ్‌ జాధవ్‌ను సెప్టెంబర్‌ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్‌ ఫైసల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాన్సులర్‌ అనుమతి లభించడంతో ఓ భారత దౌత్యాధికారి సోమవారం జాధవ్‌ను కలిశారని పాక్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యున్‌ పత్రిక తెలిపింది. అయితే, జాధవ్‌ను కలిసిన దౌత్యాధికారి ఎవరు? వారు ఎక్కడ సమావేశమయ్యారనే వివరాలు వెల్లడించలేదు.

గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్‌ జాధవ్‌కు పాక్‌ విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్‌ విషయంలో పాక్‌ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్‌ జాధవ్‌ను కలిసేందుకు దౌత్యాధికారులకు అనుమతిని పాక్‌ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్‌ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 36, పారాగ్రాఫ్‌ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు దౌత్యాధికారుల అనుమతిని జారీచేశామని పాక్‌ విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?