Breaking News
  • సిద్దిపేట: దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ నిలువబోతోంది. గజ్వేల్‌లో సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రూ.కోట్లతో నిర్మించిన కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు-హరీష్‌రావు.
  • ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కార్యదర్శి జలీల్‌ ప్రెస్‌మీట్‌. అధిక పరీక్ష ఫీజులు వసూలు చేసిన మూడు కాలేజీలు దసరాసెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలకు నోటీసులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. హాల్‌ టికెట్లపై ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఏదైనా సమస్య ఉంటే బోర్డును సంప్రదించాలి. Tsbie.gov.inలో విద్యార్థులు తమ వివరాలు చెక్‌చేసుకోవచ్చ -ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌
  • రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఆందోళనలు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు పిలుపు నిచ్చిన టీడీపీ
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు.
  • విశాఖ: రైల్వే ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ముఠా గుట్టురట్టు. దువ్వాడ, తాటిచెట్లపాలెంలో ఆర్పీఎఫ్‌ దాడులు ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌. రూ.14.89 లక్షల విలువైన ఈ-టికెట్లు సీజ్‌. కటక్‌కు చెందిన సమీర్‌కుమార్‌ ప్రధాన్‌, దుర్గారావు అరెస్ట్‌. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేస్తున్న నిందితులు ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు సీజ్‌చేసిన ఆర్పీఎఫ్‌
  • కర్నూలు: నంద్యాలలో మందుబాబుల వీరంగం. పబ్లిక్‌గా మద్యం సేవిస్తున్న యువకులు. అడ్డుచెప్పిన మస్తాన్‌ వలీ అనే వ్యక్తిపై రాళ్లదాడి మస్తాన్‌వలీకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • వరంగల్‌: హన్మకొండలో గుంతలరోడ్డుకు యువతి బలి. హంటర్‌రోడ్డులో గుంతలో పడి విద్యార్థిని బైక్‌ బోల్తా. రాంపూర్‌కు చెందిన విద్యార్థిని బ్లెస్సీ అక్కడికక్కడే మృతి.

సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోయిన్లు.. వన్నె తగ్గని నటీమణులు!

Senior Heroines Stood Out With Their Second Innings Performances, సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోయిన్లు.. వన్నె తగ్గని నటీమణులు!

ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన ఎందరో నటీమణులు.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నారు. వాస్తవానికి చూస్తే హీరోయిన్లకు హీరోల కంటే తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇండస్ట్రీ ఏదైనా సంగతి ఇంతే. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న ట్రెండ్‌ను పరిశీలిస్తే.. గత ఐదు సంవత్సరాల్లో ఎందరో కొత్త హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో కొంతమంది ఇండస్ట్రీలో పాతుకుపోతే.. మరికొందరు చిన్నా చితక సినిమాలతోనే కనుమరుగయ్యారు. అంతేకాకుండా కొన్నేళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి, చెల్లి, సపోర్టింగ్ రోల్స్‌‌కు పరిమితమయ్యారు. వాళ్లలో కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.రమ్యకృష్ణ

ఘరానా బుల్లోడు, హలో బ్రదర్, చంద్రలేఖ, అన్నమయ్య.. ఇలా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది నటి రమ్యకృష్ణ. 1990-2000 సంవత్సరం వరకు దాదాపు దశాబ్దం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. ఇక ఆ తర్వాత 2002వ సంవత్సరంలో దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది. అయితే పెళ్లి తర్వాత కూడా అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ సీనియర్ హీరోయిన్‌కు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలోని శివగామి పాత్ర దక్కింది. అంటే ఆ సినిమా రిలీజయ్యింది. ఆ తర్వాత పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవగా రానా ఎంత పాపులర్ అయ్యారో.. శివగామిగా రమ్యకృష్ణ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఆ పాత్రలో ఆమెను తప్ప మరెవరిని ఊహించలేని విధంగా అద్భుతంగా నటించారు. ‘బాహుబలి’ సినిమాతో ఆమెకు డిమాండ్ పెరిగింది. దర్శకులు ఆమె కోసం ప్రత్యేకమైన పాత్రలను రూపొందిస్తున్నారు.

2.మధుబాల

నటి మధుబాల అంటే.. ఠక్కున గుర్తొచ్చేది అరవింద స్వామి హీరోగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ చిత్రం. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది. క్రిటిక్స్ సైతం ఆమె అద్భుత నటనకు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్‌మెన్’ వంటి పలు కమర్షియల్ సినిమాలు తీసి విజయాలు అందుకున్న మధుబాల.. 2001లో సినిమాలకు దూరమయ్యింది. అయితే మళ్ళీ 2008లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె తెలుగులో ‘అంతకముందు.. ఆ తర్వాత’, ‘సూర్య వెర్సస్ సూర్య’, ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించింది.

3.నదియా

తమిళంలో టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన నదియా.. తను చేసిన మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకుంది. మలయాళ, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఈమె కేర్ అఫ్ అడ్రెస్. రెండు ఇండస్ట్రీలలోనూ ఎంతోమంది స్టార్స్, సూపర్‌స్టార్స్ సరసన నటించి మెప్పించింది. 1994లో సినిమాలకు దూరమైన నదియా 2004లో మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చింది. తల్లి క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్ చేసి ప్రేక్షకుల మన్నలు పొందింది. అంతేకాకుండా ఆమెకు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’, వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమాలకు అవార్డులు వరించాయి.

4.లక్ష్మీ

రమ్యకృష్ణ తర్వాత చెప్పుకోవాల్సిన నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె సీనియర్ హీరోయిన్ లక్ష్మీ. తాజాగా ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ కావడం విశేషం. ఆమె ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి మరీ నటిస్తున్నారు. మొన్నటికి మొన్న సమంతా హీరోయిన్‌గా వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. తాజాగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కూడా ఆమె నటన అమోఘమని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ సపోర్టింగ్ రోల్స్‌లో అదరగొడుతోంది.

5.సుప్రియా యార్లగడ్డ

పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సుప్రియా యార్లగడ్డ. ఈ చిత్రం తర్వాత పెద్దగా సినిమాలు చేయకపోయినా అక్కినేని నాగార్జున మేనకోడలుగా అందరికి సుపరిచితమే. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటున్న ఈమె అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమాతో మళ్ళీ తెలుగు తెరకు రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే దక్కాయి.

ఇలా ఒకరు.. ఇద్దరూ కాదు చాలామంది హీరోయిన్లు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎన్నో అపురూపమైన పాత్రల్లో నటించి మెప్పించారు. పవిత్ర లోకేష్, సుహాసిని, జయసుధ, మీనా, జ్యోతిక, కుష్బూ, శరణ్య, రేవతి, రాశి, రోహిణి లాంటి వారు తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.