Breaking News
  • కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమబోధన జనసేన విధానం. 8వ తరగతి వరకు మాతృభాష బోధన కేంద్రం విధానం. వైసీపీ సర్కార్‌ కేంద్ర విధానానికి వ్యతిరేకంగా వెళ్తోంది ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి -పవన్‌ కల్యాణ్‌
  • లక్ష్మీపార్వతికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు. ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి నియామకం. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న లక్ష్మీపార్వతి
  • కర్నూలు: పాణ్యం విజయానికేతన్‌ స్కూల్‌లో దారుణం. సాంబార్‌ పాత్రలోపడి ఎల్‌కేజీ విద్యార్థికి తీవ్రగాయాలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పురుషోత్తంరెడ్డి మృతి
  • కేబినెట్‌ అనంతరం మంత్రులతో సీఎం జగన్‌ భేటీ. ఔట్‌ సోర్సింగ్ కార్పొరేషన్‌పై చర్చ. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించొద్దన్న మంత్రులు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూనే 50 శాతం రిజర్వేషన్లు అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ప్రభుత్వంపై అవినీతి ముద్ర పడడానికి వీల్లేదన్న సీఎం రాష్ట్రంలో రాజకీయ అవినీతి తగ్గినా అధికారుల స్థాయిలో అవినీతి తగ్గలేదన్న పలువురు మంత్రులు
  • అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
  • తూ.గో: గోదావరిలో ఇసుక పడవ మునక. ఇసుక తరలిస్తుండగా మునిగిన పడవ. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి దగ్గర ఘటన. సురక్షితంగా బయటపడ్డ ఇసుక కార్మికులు
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి. ఓ ఆయుధం, పేలుడు పదార్ధాలు స్వాధీనం సుకుమా జిల్లా గచ్చనపల్లి అటవీ ప్రాంతంలో ఘటన

బ్రేకింగ్: సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

అలనాటి నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో రాత్రి 11.45నిమిషాలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం గీతాంజలి పార్థివదేహం నందినగర్‌లోని ఆమె నివాసంలో ఉంచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆమె నటించారు. గీతాంజలి అసలు పేరు మణి. సహనటుడు రామకృష్ణను గీతాంజలి వివాహం చేసుకున్నారు. కాకినాడలో జన్మించిన గీతాంజలి.. మొదట హిందీలో ‘పేయింగ్ గెస్ట్’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. శ్రీశ్రీ మర్యాదరామన్న, సీతారామకళ్యాణం, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, తోడ నీడ, లేత మనసులు, దేవత, శ్రీకృష్ణావతారం, ప్రాణమిత్రులు, పూలరంగడు, గూఢాచారి 116వంటి చిత్రాల్లో ఆమె నటించారు.  చివరగా నాగార్జున నటించిన ‘భాయ్’ చిత్రంలో కనిపించిన గీతాంజలి.. తమన్నా నటించిన దటీజ్ మహాలక్ష్మిలోనూ నటించింది. అయితే ఈ చిత్రం ఇంకా విడుదల అవ్వలేదు. నంది అవార్డు కమిటీలోనూ సభ్యురాలిగా పనిచేశారు. ఇక వీరి కుమారుడు ‘భూమ’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. మధ్యాహ్నం 3.30గంటలకు గీతాంజలి మృతదేహం ఫిల్మ్‌చాంబర్‌కు తరలించనుండగా.. సాయంత్రం 5గంటలకు మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు గీతాంజలి మరణంపై టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.