యంగ్‌గా హీరోలు.. బామ్మలుగా హీరోయిన్లు..?

ఆ హీరోల స్టైలే వేరు.. ఇప్పటికీ ఆ హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. థియేటర్స్ వద్ద అభిమానుల సందడే వేరు. ప్రెజెంట్ వున్న యంగ్ జనరేషన్ హీరోలకు సైతం.. వారు గట్టి పోటీ ఇస్తున్నారు. వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే.. ఇప్పటి జనరేషన్ కుర్రాళ్ళు వెనక్కి తగ్గాల్సిందే. ఇంతకీ ఎవరా హీరోలు అనుకుంటున్నారా..? ఇంకెవరు.. గత 40 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలిన వారు. వారే.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, రాజశేఖర్, వెంకటేష్, కమల్ హాసన్, […]

యంగ్‌గా హీరోలు.. బామ్మలుగా హీరోయిన్లు..?
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2019 | 8:37 AM

ఆ హీరోల స్టైలే వేరు.. ఇప్పటికీ ఆ హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. థియేటర్స్ వద్ద అభిమానుల సందడే వేరు. ప్రెజెంట్ వున్న యంగ్ జనరేషన్ హీరోలకు సైతం.. వారు గట్టి పోటీ ఇస్తున్నారు. వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే.. ఇప్పటి జనరేషన్ కుర్రాళ్ళు వెనక్కి తగ్గాల్సిందే. ఇంతకీ ఎవరా హీరోలు అనుకుంటున్నారా..? ఇంకెవరు.. గత 40 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలిన వారు. వారే.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, రాజశేఖర్, వెంకటేష్, కమల్ హాసన్, రజనీకాంత్‌లు. కానీ.. వారితో నటించిన హీరోయిన్లు మత్రం.. ఇప్పుడు వచ్చే పలు సినిమాల్లో.. బామ్మలు, అమ్మల క్యారెక్టర్లలో నటిస్తున్నారు. అప్పటి హీరోల పక్కన ఆడి పాడిన వారు.. ఇప్పటి హీరోలకు అక్కలుగా.. నటించి మెప్పిస్తున్నారు.

హీరోలు ఇప్పటికీ యంగ్‌గా.. ఉంటూ.. ప్రేక్షకులను మాత్రం ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వారి సినిమాలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య అలియాస్ నందమూరి బాలకృష్ణ అటు రాజకీయాల్లో ఉంటూ.. ఇటు.. సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి  2000వ సంవత్సరం నుంచీ.. టాలీవుడ్‌కి దూరమై.. రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. మళ్లీ తాజాగా.. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా చేశారు. ఇక నాగార్జున, వెంకటేష్‌, రాజశేఖర్‌లు కూడా.. అప్పటి నుంచి, ఇప్పటివరకూ సినీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక తమిళ, కన్నడ, హిందీతో పాటు పలుభాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు. వీరికి తెలుగులో కూడా.. మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ వీరి సినిమాలు.. హాలీవుడ్‌ రేంజ్‌లో రిలీజ్ అవుతున్నాయి.

Senior actors continue as Heroes but senior actresses appear in side roles

కానీ.. హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో ఉండేది కొద్దికాలం మాత్రమే. వారికి పెళ్లిళ్లు అయిపోయాయి అంటే.. సినిమాల్లోని సైడ్ క్యారెక్టర్స్‌ కానీ, మరో లీడ్‌ రోల్స్‌లలో కానీ చేసుకోవల్సి ఉంటుంది. అందుకే.. వెలుగు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటారు హీరోయిన్లు.

కాగా.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్‌, రాజశేఖర్, వెంకటేష్, నాగార్జునలతో ఆడిపాడిన జయసుధ, రమ్యకృష్ణ, సుహాసిని, విజయశాంతి, భానుప్రియ, టబూ, రాశీ, లయ, నదియ, రాధిక, మీనాలు సెకండ్ ఇన్నింగ్స్‌ ద్వారా వెండితెరలో మళ్లీ అడుగుపెట్టారు. జయసుధ.. సినీ ప్రారంభం నుంచీ.. ఆమె ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూనే వచ్చారు. బామ్మగా, అమ్మగా, అక్కగా.. పలు సినిమాల్లో నటించారు. ఆతరువాత రమ్యకృష్ణ కూడా.. అప్పుడప్పుడు కొన్ని సినిమాల ద్వారా అభిమానులను పలకరించి వెళ్లేది. కానీ.. బాహుబలి రీ ఎంట్రీతో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది.

గత కొంతకాలంగా.. రాజకీయాల్లో బిజీ అయి.. ఇండస్ట్రీకి దూరమైంది. చాలా రోజుల గ్యాప్ తరువాత ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది విజయశాంతి. ఇక సుహాసిని కూడా.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తాజాగా.. కొణిదెల నిహారికా నటించిన ‘సూర్యకాంతం’ సినిమాలో అమ్మగా నటించారు. ఇక రాశీ.. నాగశౌర్య హీరోగా చేసిన.. ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలో హీరోయిన్‌‌కి అమ్మగా నటించారు. మరో తెలుగు హీరోయిన్ లయ కూడా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. రవితేజ నటించిన.. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కనిపించి అలరించారు.

Senior actors continue as Heroes but senior actresses appear in side roles