సీనియర్ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఇవాళ బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 6.30గంటలకు కన్నుమూశారు. 1938లో మహారాష్ట్రలోని మథేరన్‌లో జన్మించిన ఆయన కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటితో పాటు రచయితగా మంచి పేరున్న ఆయన పలు పుస్తకాలను రచించడంతో పాటు.. కొన్నింటిని ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేశారు. ఇక అన్ని విభాగాల్లోనూ […]
ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఇవాళ బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 6.30గంటలకు కన్నుమూశారు. 1938లో మహారాష్ట్రలోని మథేరన్‌లో జన్మించిన ఆయన కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటితో పాటు రచయితగా మంచి పేరున్న ఆయన పలు పుస్తకాలను రచించడంతో పాటు.. కొన్నింటిని ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేశారు. ఇక అన్ని విభాగాల్లోనూ ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమలో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషణ్‌లు ఆయనను వరించాయి. ఇక రచయితగా 1998లో ఙ్ఞాన్‌పీఠ్ అవార్డును గిరీష్ దక్కించుకున్నారు. ఇక తెలుగులో ఆనంద భైరవి, ధర్మచక్రం, ప్రేమికుడు, రక్షకుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో ఆయన నటించిన విషయం తెలిసిందే.