Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

మరోసారి ‘బాబాయ్’ అవతారమెత్తనున్న బ్రహ్మానందం?

Senior Actor Brahmanandam to act, మరోసారి ‘బాబాయ్’ అవతారమెత్తనున్న బ్రహ్మానందం?

బ్రహ్మి అలియాస్ బ్రహ్మానందం.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు.. కడుపుబ్బా నవ్వాల్సిందే. ఎలాంటి పాత్రలోనైనా.. జీవించి నటించగలరు. ఇప్పటికే ఎన్నో పాత్రల్లో అలరించి నవ్వించారు. విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. బ్రహ్మానందానివి ఎన్ని సినిమాలున్నా.. ‘బాబయ్ హోటల్’ అనే సినిమా మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. టైటిల్‌కి తగ్గట్టుగానే.. ఆకలని హోటల్‌కి వచ్చిన వారికి కడుపునిండా పెట్టి పంపించే పాత్ర అది. ఆయన ఓ హాస్య నటుడైనా.. అంతకుమించిన భావోద్వేగాన్ని ఈ సినిమాలో పండించడమే మెయిన్ రీజన్. మళ్లీ ఇన్నేళ్లకు అదే తరహా పాత్రలో బ్రహ్మీ నటించనున్నారట. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తీస్తోన్న ‘రంగమార్తాండ’లో ఇలా కనిపించబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో వర్గాల్లో ఊపందుకుంది.

బ్రహ్మానందం.. రంగమార్తాండలో హృదయాన్ని హుత్తకునే పాత్రలో నటిస్తున్నారని.. కృష్ణ వంశీ ఇదివరకే చెప్పారు. అప్పటి నుంచి ఆయన ఎలా కనిపిస్తారా? అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. కాగా.. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్‌’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ తెరకెక్కుతోంది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకి ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.

Senior Actor Brahmanandam to act, మరోసారి ‘బాబాయ్’ అవతారమెత్తనున్న బ్రహ్మానందం?

Related Tags