వలస కార్మికులను 15 రోజుల్లోగా తరలించండి.. రాష్ట్రాలకు ‘సుప్రీం’ ఆదేశం

దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను గుర్తించి వారిని 15 రోజుల్లోగా వారి వారి స్వస్థలాలకు తరలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ ని...

వలస కార్మికులను 15 రోజుల్లోగా తరలించండి.. రాష్ట్రాలకు 'సుప్రీం' ఆదేశం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 09, 2020 | 11:34 AM

దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను గుర్తించి వారిని 15 రోజుల్లోగా వారి వారి స్వస్థలాలకు తరలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ ని అతిక్రమించినందుకు వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించాలని కూడా కోరింది. ఓ నూతన పధ్ధతి ప్రకారం వలస జీవుల ఐడెంటిఫికేషన్ కోసం జాబితాను తయారు చేయాలని, అలాగే వారి నైపుణ్యాలను బట్టి వారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు డేటాను సేకరించాలని, ఇందుకు కూడా ఓ పథకాన్ని సిధ్ధం చేయాలని  అత్యున్నత న్యాయస్థానం సూచించింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ ఇంకా అనేక రాష్ట్రాల్లో వలస కార్మికులు చిక్కుబడిపోయి ఉన్నారు. తిరిగి  తమతమ రాష్ట్రాలకు వెళ్లేందుకు తహతహలాడుతున్నారు. వారి తరలింపునకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లు సరిపోవడంలేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు… కేంద్రానికి, రాష్ట్రాలకు ఈ సూచనలు చేసినట్టు కనిపిస్తోంది.