రాజ్యసభలో మాది విపక్షం.. సంజయ్ రౌత్

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా పరిణామాలు సాగుతుండగా.. రాజ్యసభలో తాము విపక్షంలో కూర్చుంటామని సేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలగిన సేన.. ఇక ప్రతిపక్షపాత్రను పోషించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. పార్లమెంటులో తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల సీట్లను మార్చినట్టు తమకు తెలిసిందని అన్నారు.బీజేపీ అసలు రంగు మెల్లగా బయటపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. (సేనకు చెందిన ముగ్గురు ఎంపీల్లో సంజయ్ ఒకరు). సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు […]

రాజ్యసభలో మాది విపక్షం.. సంజయ్ రౌత్
Follow us

|

Updated on: Nov 17, 2019 | 11:16 AM

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా పరిణామాలు సాగుతుండగా.. రాజ్యసభలో తాము విపక్షంలో కూర్చుంటామని సేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలగిన సేన.. ఇక ప్రతిపక్షపాత్రను పోషించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. పార్లమెంటులో తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల సీట్లను మార్చినట్టు తమకు తెలిసిందని అన్నారు.బీజేపీ అసలు రంగు మెల్లగా బయటపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. (సేనకు చెందిన ముగ్గురు ఎంపీల్లో సంజయ్ ఒకరు). సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఇవాళ జరగనున్న ఎన్డీయే సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను పరిశీలించిన అనంతరం తాము దీనిపై ఇదివరకే నిర్ణయం తీసుకున్నామని, తమ మంత్రి ఒకరు ఎన్డీయే ప్రభుత్వం నుంచి రాజీనామా చేసిన విషయం తెలిసిందేనని అన్నారు. (మోదీ ప్రభుత్వం నుంచి సేన మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా చేసిన విషయం విదితమే).’ అసలు ఒకప్పటి ఎన్డీయేకి , ఇప్పటి ఎన్డీయేకి మధ్య ఎంతో భేదం ఉంది. ప్రస్తుత ఎన్డీయే కన్వీనర్ ఎవరు ? సీనియర్ నేత ఎల్. కె. అద్వానీని ‘ వదిలేశారా ‘ లేక ఆయనే క్రియాశీలంగా తప్పుకున్నారా ?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నప్పటికీ తెర చాటున ఎమ్మెల్యేల బేరసారాలు జరుగుతున్నాయని సంజయ్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రతినిధుల బృందం జరపాల్సిన భేటీ వాయిదా పడింది. మరోవైపు ఎన్సీపీ నేత శరద్ పవార్.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో సోమవారం సమావేశం కానున్నారు. ఆయన ఈ సాయంత్రం ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ఒక్కటే యోచించజాలదని, పవార్, సోనియా కూర్చుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తారని ఈ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు.