‘ సగం.. సగం ‘.. పంచుకోవలసిందే ! శివసేన ‘ కొత్త గళం ‘

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న వేళ.. శివసేన కొత్త డిమాండును తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో 50 : 50 ఫార్ములా అనుసరించాలని ఈ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అంటున్నారు. అంటే చెరి సగం పదవులు పంచుకోవాలని ఆయన కోరారు. ‘ ఇది బీజేపీ-శివసేన ప్రభుత్వంగా ఏర్పడాలి.. ఇందులో భిన్నాభిప్రాయానికి తావు లేదు ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ-శివసేన కూటమి.. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమితో జట్టు కట్టే అవకాశాలున్నాయని […]

' సగం.. సగం '.. పంచుకోవలసిందే ! శివసేన ' కొత్త గళం '
Follow us

|

Updated on: Oct 24, 2019 | 3:58 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న వేళ.. శివసేన కొత్త డిమాండును తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో 50 : 50 ఫార్ములా అనుసరించాలని ఈ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అంటున్నారు. అంటే చెరి సగం పదవులు పంచుకోవాలని ఆయన కోరారు. ‘ ఇది బీజేపీ-శివసేన ప్రభుత్వంగా ఏర్పడాలి.. ఇందులో భిన్నాభిప్రాయానికి తావు లేదు ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ-శివసేన కూటమి.. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమితో జట్టు కట్టే అవకాశాలున్నాయని వఛ్చిన వదంతులను ఆయన కొట్టిపారేశారు. తమకు ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారని, ఒక ఎన్నికలో సీట్లు ఎక్కువైనా.. లేదా తక్కువైనా కావచ్ఛునని ఆయన అన్నారు. మేం ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడతాం..ఆయన సీఎంను సంప్రదిస్తారు.. అసలు ఈ ఎన్నికకు ముందే ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాపై బీజేపీతో అంగీకారం వచ్చింది ‘ అని సంజయ్ పేర్కొన్నారు. అయిదేళ్ల సీఎం పదవీ కాలాన్ని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని శివసేన కోరే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 126 స్థానాలకు పోటీ చేసిన శివసేన 64 చోట్ల లీడింగులో ఉంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని (288) సీట్లకూ పోటీ చేసిన ఈ పార్టీ.. 63 స్థానాలను గెలుచుకుంది. కాగా-సగం సగం పదవులు పంచుకోవాలన్న ప్రతిపాదనను బీజేపీ అంగీకరించలేదు. ఆ మధ్య ఈ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. ఈ డీల్ పై ఉద్ధవ్ థాక్రే వద్ద ప్రస్తావించారు. కానీ శివసేనకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 300 మంది శివసేన కార్యకర్తలు, 20 మందికి పైగా కార్పొరేటర్లు రాజీనామా చేశారు. కానీ ఉద్ధవ్ దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. సోదరుల్లో ఎవరు పెద్ద, ఎవరు చిన్న అన్నది ముఖ్యం కాదని, వారి మధ్య మంచి సంబంధాలే ముఖ్యమని ఆయనఅన్నారు. తాజాగా.. సంజయ్ రౌత్ చేసిన డిమాండ్ పార్టీలో కలకలం రేపినా ఆశ్చర్యం లేదంటున్నారు.