వరంగల్ జిల్లాలో స్వచ్చంద లాక్ డౌన్

కరోనా కల్లోలానికి పల్లెలు పట్టణాల గజగజ వణుకుతున్నాయి. నిత్యం పెరుగుతున్న కేసులతో భయాందోళనలకు గురవుతున్నారు. ఊరూర స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకుంటూ కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజా ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు కరోనా వైరస్ విస్తరిస్తున్నందున వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేయాలని నిర్ణయించారు.

వరంగల్ జిల్లాలో స్వచ్చంద లాక్ డౌన్
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 10, 2020 | 7:49 PM

కరోనా కల్లోలానికి పల్లెలు పట్టణాల గజగజ వణుకుతున్నాయి. నిత్యం పెరుగుతున్న కేసులతో భయాందోళనకు గురవుతున్నారు. ఊరూర స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకుంటూ కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేయాలని నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 331 మంది కరోనా బారిన పడినట్టు వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 128 మంది, వరంగల్ రూరల్ జిల్లాలో 125 మంది, మహబూబాబాద్ జిల్లాలో 21 మంది, జనగామ జిల్లాలో27, ములుగు జిల్లాలో 22, భూపాపలపల్లి జిల్లాలో 12 మంది కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు కరోనా సోకిన వారి కుటుంబసభ్యులు సైతం హోం క్వారంటైన్ లో కొనసాగుతున్నారు.

అయితే కరోనా నియంత్రణకు స్వీయ నిర్భంధమే మార్గంగా భావించిన వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. దుకాణాలు తెరవడంతో రాకపోకలు పెరిగి రద్దీగా మారుతున్నాయి. భౌతిక దూరం పాటించక కరోనా వ్యాప్తి చెందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలకు వచ్చే వారు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వ్యాపారులు కోరుతున్నారు. మాస్కులు లేనివారికి సరుకులు విక్రయింవద్దని నిర్ణయించారు.