అప్పుడలా ! ఇప్పుడిలా !!

Sekhar Reddy Re Joined in TTD Board, అప్పుడలా ! ఇప్పుడిలా !!

టిటిడి పాలకమండలిలో శేఖర్ రెడ్డికి మళ్ళీ చోటు దక్కింది. గతంలో కేసుల నేపథ్యంలో కోల్పోయిన పదవిని శేఖర్ రెడ్డి తిరిగి పొందారు. చెన్నై లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా శేఖర్ రెడ్డి ని నియమించారు. లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా వ్యవహరించే వ్యక్తి ఆటోమేటిక్ గా టిటిడి ట్రస్ట్ బోర్డు లో ప్రత్యేక ఆహ్వానితునిగా కూడా ఉంటారు. సో.. లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా నియమితులైన శేఖర్ రెడ్డి టిటిడి పాలకమండలి లో ప్రత్యేక అహ్వానితుడిగా కొనసాగబోతున్నారు. గతంలో టిడిపి హయాంలో టిటిడి బోర్డు సభ్యుడిగా పనిచేసిన శేఖర్ రెడ్డి ఇంటిపై భారీ స్థాయిలో ఐటీ దాడులు జరగడంతో అప్పటి టిడిపి ప్రభుతం ఆయన్ని టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించారు. ఇపుడు శేఖర్ రెడ్డి పునర్నియామకం రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *