బీజేపీ సీటును తిరస్కరించిన సెహ్వాగ్‌?

దిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్…ఈ నేమ్ వరల్డ్ క్రికెట్ చరిత్రలో ఒక హిస్టరీ ఉంది. డాషింగ్ ఓపెనర్‌గా వీరు ఇండియాకు అందించిన విజయాలు అనేకం. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మైంట్ ప్రకటించిన సెహ్వాగ్ ఎప్పుడు సోషల్ మీడియా వేదికల్లో యాక్టీవ్‌గా ఉంటూ ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను సెటైరికల్‌గా, కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంటాడు. అయితే తాజాగా సెహ్వాగ్ సేవలను తమ పార్టీకి వినియోగించుకోవాలని భావించింది బిజేపీ. అయితే  సెహ్వాగ్‌ భాజపా టికెట్‌ను తిరస్కరించారని భాజాపా నేతల నుంచి వస్తున్న […]

బీజేపీ సీటును తిరస్కరించిన సెహ్వాగ్‌?
Follow us

|

Updated on: Mar 15, 2019 | 2:27 PM

దిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్…ఈ నేమ్ వరల్డ్ క్రికెట్ చరిత్రలో ఒక హిస్టరీ ఉంది. డాషింగ్ ఓపెనర్‌గా వీరు ఇండియాకు అందించిన విజయాలు అనేకం. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మైంట్ ప్రకటించిన సెహ్వాగ్ ఎప్పుడు సోషల్ మీడియా వేదికల్లో యాక్టీవ్‌గా ఉంటూ ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను సెటైరికల్‌గా, కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంటాడు. అయితే తాజాగా సెహ్వాగ్ సేవలను తమ పార్టీకి వినియోగించుకోవాలని భావించింది బిజేపీ.

అయితే  సెహ్వాగ్‌ భాజపా టికెట్‌ను తిరస్కరించారని భాజాపా నేతల నుంచి వస్తున్న సమాచారం. వ్యక్తిగత కారణాలతో సెహ్వాగ్‌ భాజపా సీటును కాదన్నారని పార్టీలో ఇన్నర్ ఇన్ఫర్మేషన్. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలోని రోహ్‌తక్‌ నుంచి వీరూ భాజపా అభ్యర్థిగా నిలబడతారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని సెహ్వాగ్‌ ట్విటర్‌లో ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి వదంతులు కొన్ని ఎప్పటికీ మారవు. 2014లోనూ ఇలాగే ప్రచారంచేశారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లోనూ చేస్తున్నారు. అప్పుడూ, ఇప్పుడూ నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు’ అని వీరు స్పష్టం చేశారు.