పోలింగ్ ఒక్క స్ధానానికే.. భద్రతా సిబ్బంది మాత్రం 18 వేలమంది.. ఎక్కడో తెలుసా?

Security Personnel on Duty in Bastar's Dantewada Bypoll in Chhattisgarh, పోలింగ్ ఒక్క స్ధానానికే.. భద్రతా సిబ్బంది మాత్రం 18 వేలమంది.. ఎక్కడో తెలుసా?

ఆ రాష్ట్రంలో ఒకేఒక్క అసెంబ్లీ స్ధానానికి ఉపఎన్నిక జరగనుంది. కానీ భద్రతా చర్యలు మాత్రం కనీవినీ ఎరుగనీ రీతిలో జరుగుతున్నాయి. ఏకంగా 18 వేలమంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అసెంబ్లీ స్దానానికి అక్టోబర్ 21న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిని గత ఏప్రిల్ నెలలో మావోయిస్టులు దారుణంగా హత్యచేయడంతో ఆ స్ధానానికి ఉపఎన్నిక జరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా 18 వేలమంది పోలీసులను నియమించడం చూస్తే ఆ దంతేవాడ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎంతగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

భీమా మాండవి దంతెవాడ సిట్టింగ్ ఎమ్యెల్యే. బస్తర్ ప్రాంతంలో మొత్తం 12 అసెంబ్లీ స్ధానాలుండగా దంతెవాడలో మాత్రమే గెలుపొందింది. చత్తీస్‌గడ్‌లోని దంతేవాడ జిల్లాలో భీమా మండవి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయన దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో అయిదుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో ఉపఎన్నిక జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *