Breaking News
  • నిజామాబాద్‌: ఆర్మూర్‌లో దారుణం. టీవీ సౌండ్‌ పెంచాడని ఇంటి యజమానిని చంపిన కిరాయిదారుడు. ఇంటి యజమాని రాజేందర్‌ తలపై కొట్టిన బాలనర్సయ్య. అక్కడికక్కడే రాజేందర్‌ మృతి, పరారీలో బాలనర్సయ్య.
  • శ్రీకాకుళం: మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి. జలమూరు మండలం శ్రీముఖలింగం ఆలయం దగ్గర విషాదం. వంశధార నదిలో స్నానానికి దిగి 65 ఏళ్ల వృద్ధుడు మృతి. మృతుడు పాలకొండకు చెందిన రెడ్డిగా గుర్తింపు.
  • అనంతపురం: ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ నిర్వాకం. పెనుకొండ దగ్గర నిలిచిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు. రాత్రి నుంచి బస్సులోనే ప్రయాణికుల పడిగాపులు. బస్సును రోడ్డుపై వదిలి పరారైన డ్రైవర్‌, క్లీనర్‌. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు. మార్గం మధ్యలో బస్సుకు ఆరుసార్లు మరమ్మతులు. పట్టించుకోని ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలంటున్న ప్రయాణికులు.
  • చెన్నై ఐఐటీలో మరో వివాదం. ప్రాజెక్ట్ మేనేజర్‌ బెనర్జీపై విద్యార్థినుల ఫిర్యాదు. మొబైల్‌ఫోన్‌తో బాత్‌రూమ్‌లో వీడియోలు తీస్తున్నాడని ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు. బెనర్జీ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు. కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
  • తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

అయోధ్యలో హై టెన్షన్.. రెండు నెలల పాటు 144 సెక్షన్ విధింపు..!

Section 144 Imposed In Ayodhya, అయోధ్యలో హై టెన్షన్.. రెండు నెలల పాటు 144 సెక్షన్ విధింపు..!

రాజకీయంగా సున్నితమైన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు తుది దశకు చేరుకున్నాయి. వారం రోజుల దసరా సెలవుల తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ 38వ రోజు వాదనలు ప్రారంభం కానున్నాయి. రెండు పక్షాలు ఈ నెల 17వ తేదీ లోపు వాదనలు పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తుది తీర్పును నవంబరు 17వ తేదీన వెల్లడిస్తానని తెలిపింది. ఇక రంజన్‌ గొగోయ్‌ అదే రోజు రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు.

తుది తీర్పుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు అయోధ్యలో 144 సెక్షన్‌ను అమలు చేయనున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. కాగా ఇప్పటి వరకూ 37 సార్లు అయోధ్య వివాదం పై సుప్రీంలో వాదోపవాదనలు జరిగాయి. అయినప్పటికీ కేసులో పురోగతి లేదు. దీంతో నవంబర్ 17వ తేదీ నాటికి ఈ వివాదం పై తీర్పు ప్రకటిస్తామని.. రంజన్ గగోయ్ డెడ్ లైన్ పెట్టారు. ఇక నేటి నుంచి మొదటి మూడు రోజులు హిందూ సంఘాలు, ముస్లిం కమిటీలు తమ వాదనలను వినిపించే అవకాశం కల్పించింది. వీరి వాదనలు విన్న తర్వాత గురువారం తుది విచారణను నిర్వహిస్తామని రంజన్ గగోయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి తీర్పు ప్రకటించినా అన్ని వర్గాల ప్రజలు స్వాగతించడానికి సిద్దంగా ఉండాలని అధికారులు, రాజకీయ నాయకులు కోరుతున్నారు.

Related Tags