అమరావతిలో 144 సెక్షన్..!

Section 144 imposed at AP Assembly in Amaravati, అమరావతిలో 144 సెక్షన్..!

అమరావతిలో 144 సెక్షన్‌‌ను విధించారు పోలీసులు. రేపు ఏపీ అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపుని ఇచ్చిన  నేపథ్యంలో పోలీసులు ఈ సెక్షన్‌ను విధించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రాజధాని ప్రాంతంలో 30 పోలీస్ యాక్ట్‌తో సహా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా అసెంబ్లీ వెలుపలికి పోలీసులు అనుమతి తెలపడంలేదు. అలాగే.. అసెంబ్లీ చుట్టుపక్కల కూడా పోలీసులు నియంత్రణలో ఉంచారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసులు మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *