144 సెక్షన్ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఇష్టానుసారం ఎప్పుడు పడితే అప్పుడు 144 సెక్షన్ ప్రయోగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వాలు తరచూ 144 సెక్షన్‌ ప్రయోగిస్తోన్న సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా.. తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. పలు పార్టీలు కానీ, ప్రజలు కానీ ఉద్యమాలు, ర్యాలీలు చేస్తూంటారు. దీంతో పలువురు అధికారులు ఆయా ప్రాంతాల్లో144 సెక్షన్‌ని ఉపయోగిస్తూంటారు. అయితే.. ఇది తప్పని, ముమ్మాటికీ అధికార దుర్వినియోగమంటోంది సుప్రీం కోర్టు. సాధారణంగా.. తమతమ […]

144 సెక్షన్ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Jan 11, 2020 | 6:12 PM

ఇష్టానుసారం ఎప్పుడు పడితే అప్పుడు 144 సెక్షన్ ప్రయోగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వాలు తరచూ 144 సెక్షన్‌ ప్రయోగిస్తోన్న సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా.. తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. పలు పార్టీలు కానీ, ప్రజలు కానీ ఉద్యమాలు, ర్యాలీలు చేస్తూంటారు. దీంతో పలువురు అధికారులు ఆయా ప్రాంతాల్లో144 సెక్షన్‌ని ఉపయోగిస్తూంటారు. అయితే.. ఇది తప్పని, ముమ్మాటికీ అధికార దుర్వినియోగమంటోంది సుప్రీం కోర్టు.

సాధారణంగా.. తమతమ డిమాండ్ల మేరకు ప్రజా ఉద్యమాలు, ర్యాలీలు జరుగుతూంటాయి. ఈ నేపథ్యంలో వీటిని కట్టడి చేయడానికి ఆయా ప్రాంతాల ప్రభుత్వాలు 144 సెక్షన్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది సరికాదని.. ప్రభుత్వాలు ఇష్టానుసారం 144 సెక్షన్‌ని విధించరాదని పేర్కొంది. తాజాగా.. జమ్మూ కశ్మీర్‌లో ఆంక్షల విధింపుపై వెలువరించిన తీర్పులో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరి, అత్యవసరంగా ప్రమాదం ఉంటే తప్ప తరచూ ఈ సెక్షన్‌ని ప్రయోగించ కూడదన్నారు. ఇలా చేస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనన్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా నియంత్రణలు విధించాలని, అన్నింటికీ ఒకే సూత్రాన్ని అమలు చేయడానికి వీల్లేదని నిర్దేశించారు.

144 సెక్షన్‌పై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు:

1)  హింస చెలరేగేందుకు అవకాశం, ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప ఈ అధికారాన్ని ప్రయోగించకూడదు.

2)  ఉద్యోగుల విధులకు అడ్డుతగిలే, గాయపరిచే అవకాశం ఉన్నప్పుడు అలాంటి చర్యలను అడ్డుకోవడానికి ఈ అధికారాన్ని ప్రయోగించాలి.

3)  పరిస్థితులు మరింత తీవ్రంగా మారినప్పుడు ఆంక్షలను ఆయా ప్రాంతాల్లో దీర్ఘకాలం 144 సెక్షన్‌ని అమలు చేయవచ్చు.

4)  144 సెక్షన్ విధించేటప్పుడు ‘ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ’ సూత్రానికి మెజిస్ట్రేట్ కట్టుబడాలి. ఈ సూత్రం ఆధారంగా ప్రజల హక్కులు, నియంత్రణల మధ్య సమతౌల్యం పాటించాలి.

5)  ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ చాలా విలువైంది. అది 19(1) అధికరణం కింద రాజ్యాంగం కల్పించిన అంత్యంత పవిత్రమైన హక్కు. బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు ఎల్లప్పుడూ పత్రికా స్వేచ్ఛను గౌరవించాలి.