కాంచీపురంలోని ఓ ఆలయంలో భారీగా బయటపడిన గుప్త నిధులు..ప్రభుత్వానికి ఇచ్చేది లేదంటున్న దేవస్థానం ప్రతినిధులు

గుప్తనిధులు బయటపడ్డాయి. మన దగ్గర కాదు.. మనరాష్ట్రంలో కానేకాదు. తమిళనాడులో. ఇప్పుడు బయటపడ్డాయని అందరూ అక్కడికి పరుగులు తీయకండి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అన్నిటినీ స్వాధీనం చేసుకుని..

కాంచీపురంలోని ఓ ఆలయంలో భారీగా బయటపడిన గుప్త నిధులు..ప్రభుత్వానికి ఇచ్చేది లేదంటున్న దేవస్థానం ప్రతినిధులు
Follow us

|

Updated on: Dec 14, 2020 | 6:39 AM

తమిళనాడు కాంచీపురంలో గుప్త నిధులు బయటపడ్డాయి.జిల్లాలోని ఉత్తర మేరుర్‌లో ఉన్న కుళంబేశ్వరాలయంలో బంగారం బయటపడింది. పల్లవుల కాలం నాటి అతిపురాతనమైన ఆలయం మరమ్మతుల పనులు చేస్తుండగా నిధులు బయటపడ్డాయంటున్నారు అధికారులు.ఆలయంలో తవ్వుతుండగా గుప్త నిధులు వెలుగులోకి వచ్చాయి.

బంగారు నాణాలు, నగలు బయటపడడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు స్దానికులు.బయటపడ్డ బంగారం సుమారు రెండు కిలోల పైనే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. అయితే ఇంతేనా? ఇంకా ఏమైనా నిధులు ఉన్నాయా అనే కోణంలో తవ్వకాలు సాగుతున్నాయి. గుప్తు నిధులపై ఆలయ ట్రస్ట్‌ బోర్డు, ప్రభుత్వం మధ్య వివాదం మొలైంది.

దేవాదాయశాఖ పరిధిలో ఆలయం లేదంటోంది ట్రస్ట్ బోర్డు. బయటపడ్డ గుప్త నిధులు ఆలయానికి చెందాలంతోంది. పురాతన ఆలయం కావడంతో అలా కుదరదంటోంది ప్రభుత్వం.. అయితే కోర్టుకు వెళ్తామంటున్న కుళంబేశ్వరాలయం ట్రస్ట్ బోర్డు. అయితే ఇటీవల గుప్తనిధుల తవ్వకాలు తమిళనాడు వ్యాప్తంగా పెరిగిపోయాయి.

దానికి తోడు అమావస్య, పున్నమి రోజుల్లో కొందరు దేవాలయాలముందు మంత్రించడం.. సరిగ్గా 21 రోజుల తర్వాత గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతుండడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు కాంచీపురంలో గుప్తనిధులు బయటపడడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిధుల స్మగ్లర్లలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇప్పటికే అలర్ట్‌ అయిన ప్రభుత్వం అన్ని దేవాలయాల దగ్గర సెక్యూరిటీని పెంచుతోంది. అనుమానంగా ఎవరు కనిపించినా అదుపులోకి తీసుకోవాలని డీజేపీ ఆదేశించారు. అటు అన్ని చెక్‌పోస్టుల్లోనూ సోదాలు జరుపుతున్నారు.

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!