బ్రేకింగ్: చంద్రబాబు ఇంటిపై రహస్య డ్రోన్లు..

Secret drones on Chandrababu house in Krishna District, బ్రేకింగ్: చంద్రబాబు ఇంటిపై రహస్య డ్రోన్లు..

కృష్ణా జిల్లాలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నివాసంపైకి డ్రోన్లు ఉపయోగించిన ప్రైవేటు వ్యక్తులు. వారిని గుర్తించి పట్టుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. హుటాహుటిన మాజీ సీఎం నివాసం వద్దకు చేరుకున్న దేవినేని అవినాష్, ఇతర నాయకులు. డ్రోన్లు ఉపయోగించి రహస్యంగా వీడియో చిత్రీకరిస్తున్నారని,

చంద్రబాబు నాయుడుపై దాడి చేసేందుకు రహస్యంగా ఇంటి భద్రత,సెక్యూరిటీ ఉండే ప్రదేశాలు చిత్రీకరిస్తున్నట్టు ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నమంటూ.. టీడీపీ నాయకులు జనార్థన్, దేవినేని అవినాష్‌లు ఆందోళన చేస్తున్నారు. పోలీస్ జీపుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Secret drones on Chandrababu house in Krishna District, బ్రేకింగ్: చంద్రబాబు ఇంటిపై రహస్య డ్రోన్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *