Breaking News
  • సరూర్ నగర్ చెరువు లో కొట్టుకు పోయిన నవీన్ కుమార్ మృత దేహానికి నేడు పోస్ట్ మార్టం. ఆదివారం సాయంత్రం నాల లో కొట్టుకుపోయి సరూర్ నగర్ చెరువు లో నిన్న మధ్యాహ్నం తేలిన నవీన్ మృత దేహం. కొట్టుకు పోయిన స్థలం నుండి 100 మీటర్ల దూరం లో లభ్యమైన నవీన్ మృత దేహం. 8 అడుగుల లోతు లో బురదలో ఇర్రుకున్న నవీన్ మృత దేహం. ఈ రెండు ఘటనల పై ప్రభుత్వం సీరియస్. నగరం లో ఓపెన్ నాలా లను క్లోజ్ చేసిన జిహెచ్ఎంసి అధికారులు. నేరేడ్మెంట్ లో మునిసిపల్ మంత్రి కే టి ఆర్ సహా అదికరుల పై ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు. సరూర్ నగర్ లో చనిపోయిన నవీన్ కుమార్ భార్య కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన సబితా ఇంద్రా రెడ్డి. సరూర్ నగర్ చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసుల డిమాండ్.
  • ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్. తనపై విపక్ష సభ్యుల దుష్ప్రవర్తనకు నిరసనగా దీక్ష. ఈనెల 20న వ్యవసాయ బిల్లుల సందర్భంగా సభ్యుల దురుసు ప్రవర్తన.
  • ఆసిపాబాద్: తృటిలో తప్పించుకున్న బాస్కర్ టీం, మంగిదళం సభ్యుల కోసం మూడవ రోజు కొనసాగుతున్న వేట. కొమురంభీం- మంచిర్యాల మావోయిస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ లక్ష్యంగా ఆపరేషన్. మూడంచెల పహారాతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అణువణువు గాలిస్తున్న గ్రే హౌండ్స్ బలగాలు. తెలంగాణ - మహారాష్ట్ర - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల వద్ద పటిష్ఠ నిఘా . ప్రాణహిత పరివాహక ప్రాంతాలైన మంచిర్యాల, ఆసిపాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 18 గ్రేహౌండ్స్‌ దళాల ఆధ్వర్యంలో అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు. కడంబ, సిద్దేశ్వర గుట్టలు , తిర్యాణి , పెంబి, కోటపల్లి - వేమనపల్లి, కవ్వాల్ అభయారణ్యాలలో డ్రోన్‌ కెమెరాల సాయంతో కొనసాగుతున్న పహరా. కీలకంగా మారిన మావోయిస్టుల వద్ద దొరికిన డంప్. ఆసిపాబాద్ జిల్లా తిర్యాణి మండలం గుండాల వద్ద, దంతన్‌పల్లి సమీపంలో, కడంబా అడవుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో మూడు చోట్ల దొరికిన మావోయిస్టుల కిట్లు, డైరీలతో భారీగా రిక్రూట్మెంట్ జరిగినట్టు ప్రాథమిక అంచనా. పోలీసుల బూట్ల చప్పులతో వణికిపోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీ, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు. జిల్లా సరిహద్దు‌ దాటి పోకుండా మహరాష్ట్ర - చత్తీస్‌గఢ్ పోలీసుల సహకారం తీసుకుంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ బలగాలు.
  • నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ . మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఏర్ పోర్ట్ నుండి ఢిల్లీకి కి పయనం . పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ను కలిసే అవకాశం . రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం బకాయిలు తో సహా పలు అంశాలు ప్రస్తావించే అవకాశం . డిల్లీ వెళ్లనున్న నేపధ్యంలో ఉదయం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష చేయనున్న సీఎం జగన్ . క్యాంప్ కార్యాలయం లో 11 గంటలకు సమీక్ష . కేంద్రం నుండి రావాల్సిన నిధులు, బకాయిలు వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం.
  • చెన్నై: తమిళనాడు లో కురుస్తున్న భారీ వర్షాలు , వరద ప్రభావానికి ఉప్పొంగి ప్రవహిస్తున్న జలాశయాలు . కేరళ- తమిళనాడు సరిహద్దు జిల్లాలైన కన్యాకుమారి, నీలగిరి , కోయిఅంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . భారీ వర్షాలకు ఇప్పటికే రెండు సార్లు నిండిపోయిన భవానిసాగర్ డాం. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ. కర్ణాటక - తమిళనాడు సరిహద్దు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరీ నది .కర్ణాటక లోని కేఆర్ ఎస్ డాం నుండి 50 వేల కుసెక్యూల నీరు దిగువకు విడుదల చేయడం తో పెరిగిన వరద ఉధృతి . ధర్మపురి ,క్రిష్ణగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడం తో వరద ముంపు ఎక్కువగా ఉంటుందని వరద ముంపు గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు. కేరళ , కర్ణాటక నుండి భారీగా వరదనీరు వస్తుండడం తో సరిహద్దు జిల్లాలో ఉన్న జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. వరద ముంపు ఉండడం తో ముఖ్యమైన డాం ల నుండి ఎప్పటికపుడు గేట్లు ఎత్తివేసి నీటి ని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు .
  • అమరావతి: సీఐడీకి సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు. రూ.117 కోట్లను కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నంపై కేసు నమోదు. సీఐడీ ఏడిజి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ. నిందితుల కోసం పశ్చిమబెంగాల్, కర్ణాటక, దిల్లీలకు ప్రత్యేక బృందాలు. దిల్లీలోని శర్మ ఫోర్సింగ్. పశ్చిమ బెంగాల్ లోని మల్లబపూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. కర్ణాటకలోని అద్వైత వీకే , హోలో బ్లాక్స్ &ఇంటర్ లాక్ సంస్థల పేరిట ఫోర్జరీ చెక్కులను గుర్తింపు. ఈ అంశాలపై సీఐడీ ఆరా. ఫోర్జరీ వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్న తుళ్లూరు పోలీసులు. మరో వైపు ఏసీబీ అంతర్గత విచారణ. గతంలో ఎప్పుడైనా నకిలీ చెక్కులతో నగదును మార్చారా అనే కోణంలోనూ ఆరా .

TDP leader silence: రాజు గారి మౌనం వెనుక మర్మం ఏంటో?

మాజీ మంత్రి సుజయరంగారావు కొంత కాలంగా మౌనం పాటిస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా? లేక పార్టీ మారతారా అన్న విషయంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
secret behind tdp leader silence, TDP leader silence: రాజు గారి మౌనం వెనుక మర్మం ఏంటో?

TDP leader Sujaya Rangarao silence since many days: రాజుగారి మౌనానికి అర్ధమేంటి? ఉంటారా? పార్టీ మారతారా? అని ఉత్కంఠతో చూస్తోంది టీడీపీ కేడర్‌. ఎన్నికల తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు. దీంతో తమ నేత స్టాండ్‌ తెలియక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. దీంతో ఆ బొబ్బిలి రాజు ప్రస్థానం ఎటు అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సుజయకృష్ట రంగారావు… విజయనగరం జిల్లా బొబ్బిలి రాజవంశీయులు… రాచరికం అంతరించిన తర్వాత కూడా ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ తన నియోజకవర్గపు కోటను పాలించారు. అయితే, ఇప్పుడు, యుద్ధంలో ఓడిన రాజులా డీలాపడిపోయారు. దీంతో ఆయన రాజ్యంలో కార్యకర్తలు విలవిల్లాడిపోతున్నారు. రాజుగారి మౌనాన్ని తలచుకుని కుంగిపోతున్నారు.

రాజరికపు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన సుజయకృష్ట రంగారావు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందాక, టీడీపీలో చేరి మంత్రి పదవిని చేపట్టారు. అయితే, మంత్రి అయిన తర్వాత, సుజయకృష్ట రంగారావు నియోజకవర్గ అభివృద్దిని పట్టించుకోలేదని…… అందుకే 2019 ఎన్నికల్లో ఓడిపోయారని అంటారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు సుజయకృష్ట రంగారావు దూరంగా ఉంటున్నారు. అయితే, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ, నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉండటంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

Also read: Internal war between TRS MLAs over Cooperative posts

నియోజకవర్గ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసి, పార్టీని బలోపేతం చేయాల్సిన రాజుగారు ఇలా, మౌనం దాల్చడమేంటని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. సుజయకృష్ట రంగారావుతోపాటు ఆయన సోదరుడు శ్వేతా చలపతి రంగారావుకు నియోజకవర్గ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. వాళ్లిద్దరూ ప్రజల్లోకి వెళ్తే మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. సుజయకృష్ట రంగారావు సోదరుడు శ్వేతా చలపతి రంగారావు టీడీపీని వీడి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయనగరం టీడీపీలో స్తబ్దత నెలకొనడంతో ఇప్పటికే పలువురు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని అంటున్నారు.

మొత్తానికి, విజయనగరంలో తెలుగుదేశాన్ని ముందుకు నడిపించే నాయకుడు లేడంటూ కొట్టుమిట్టాడుతున్న టీడీపీ శ్రేణులను, బొబ్బిలి రాజుగారి మౌనం, మరింత కుంగదీసేలా ఉందని అంటున్నారు. మరి, రాజుగారి మనసులో ఏముందో… పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండటానికి కారణాలేంటో తెలియాలంటే ఆయన మౌనం వీడాల్సిందే.

Related Tags