ఏపీలో అక్టోబర్ 2 నుంచి రెండో దశ.. వివరాలు తెలిపిన పెద్దిరెడ్డి

గత జూన్‌ ఒకటవ తేదీ నుంచి నిర్వహిస్తున్న ‘‘మనం - మన పరిశుభ్రత’’ కార్యక్రమం రెండో దశకు రంగం సిద్దం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రెండో దశ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఏపీలో అక్టోబర్ 2 నుంచి రెండో దశ.. వివరాలు తెలిపిన పెద్దిరెడ్డి
Follow us

|

Updated on: Sep 23, 2020 | 3:47 PM

గత జూన్‌ ఒకటవ తేదీ నుంచి నిర్వహిస్తున్న ‘‘మనం – మన పరిశుభ్రత’’ కార్యక్రమం రెండో దశకు రంగం సిద్దం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రెండో దశ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ‘‘మనం-మన పరిశుభ్రత’’ రెండోదశను ప్రతి మండలంలో 5 నుంచి 10 గ్రామాలలో అమలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు.

జూన్ 1వ తేదీన రాష్ట్రంలో ప్రారంభమైన మనం-మన పరిశుభ్రత కార్యక్రమం సత్ఫలితలిచ్చిందని మంత్రి వివరించారు. తొలిదశలో భాగంగా 1320 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడిందని పెద్దిరెడ్డి అంటున్నారు. 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగామని ఆయన తెలిపారు.

ప్రజల నుంచి పంచాయతీలకు విరాళాలుగా రూ.1.72 కోట్లు జమ అయ్యాయని వివరించిన మంత్రి పెద్దిరెడ్డి, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖలు రాశారు. ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.