Breaking News
  • టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్.
  • కర్ణాటకలో కరోనాకు బలవుతున్న ప్రజాప్రతినిధులు. ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రావు మృతి. కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యే. నిన్న మృతిచెందిన కేంద్ర మంత్రి సురేశ్ అంగాడి. అంగాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెలగావి (బెలగాం) కూడా కర్ణాటకలోనే అంతకు ముందు కర్ణాటక బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ మృతి.
  • ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కి కోరిన పాజిటివ్. నిన్నటి నుండి బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి.
  • ఏసీబీ అధికారులకు మాజీమంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు. మంత్రి జయరాంపై ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు, వెలగపూడి. మంత్రి జయరాం, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేశాం. ఆధారాలుంటే చూపించండి రాజీనామా చేస్తామని జయరాం అన్నారు. అన్ని ఆధారాలు చూపించా-మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఏసీబీ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంది. న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం-అయ్యన్నపాత్రుడు.
  • సినీ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు సమన్లు. నోటీసులు అందుకున్నట్టు వెల్లడించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌. రేపు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరుకానున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌పై ఆరోపణలు.
  • కడప: కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నేతల నిరసన. సీఎం జగన్‌ ప్లాన్‌ ప్రకారమే అంతా నడుస్తోంది. జగన్‌ మౌనంగా ఉంటూ ఆనందిస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి, కొడాలి నాని వెంటనే రాజీనామా చేయాలి. -మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.
  • మహారాష్ట్ర: భివాండిలో భవనం కూలిన ఘటనలో 41కి చేరిన మృతుల సంఖ్య. ఘటనా స్థలంలో పూర్తయిన సహాయక చర్యలు.

కోవాక్జిన్ ట్రయల్స్‌లో రెండో దశ పూర్తి

యావత్ ప్రపంచం ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ వేగవంతమయ్యాయి. పలు దేశాలు, పలు లాబరేటరీలు నిర్వహిస్తున్న కరోనా వైరస్ క్లినికల్ ట్రయల్స్‌లో అత్యంత కీలకంగా మారిన హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో ...

second phase clinical trials completed, కోవాక్జిన్ ట్రయల్స్‌లో రెండో దశ పూర్తి

యావత్ ప్రపంచం ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ వేగవంతమయ్యాయి. పలు దేశాలు, పలు లాబరేటరీలు నిర్వహిస్తున్న కరోనా వైరస్ క్లినికల్ ట్రయల్స్‌లో అత్యంత కీలకంగా మారిన హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ రెండో దశ పూర్తి కావచ్చింది. తాజాగా నిమ్స్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 50 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశారు.

రెండు దశలో కోవ్యాక్సిన్ వ్యాక్సిన్‌ను 50 మంది వాలంటీర్లకు ఇచ్చిన నిమ్స్ వైద్య బృందం వీరందరికీ 21 రోజుల తర్వాత బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు మొదటి దశలో ఉన్న 40 మంది వాలంటీర్లకు, రెండో దశలో 50 మంది వాలంటీర్లకు కోవాగ్జిన్ వాక్సిన్ ఇంజెక్ట్ చేసినట్లు నిమ్స్ ఆస్పత్రి వెల్లడించింది.

భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాక్జిన్ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్‌పై నిమ్స్ వైద్య బృందం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. తాజాగా రెండోదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన నేపథ్యంలో వ్యాక్సిన్ రూపకల్పనలో ఒక ముందడుగుగా భావిస్తున్నామని నిమ్స్ వైద్య బృందం వెల్లడించింది. ఈ మేరకు నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి క్లినికల్ ట్రయల్స్ వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు.

Related Tags