Local polls: లోకల్ పోల్స్‌పై తగ్గేది లేదు.. రీజన్ ఇదేనన్న ఈసీ

ఏపీలో లోకల్ పోల్స్‌పై చెలరేగిన రచ్చ మరో లెవెల్‌కు చేరింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా చెల్లదంటున్న ప్రభుత్వం... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఒత్తిడి తెస్తుంటే.. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తన నిర్ణయానికి కట్టుబడి వుంటానని మరింత గట్టిగా చాటారు.

Local polls:  లోకల్ పోల్స్‌పై తగ్గేది లేదు.. రీజన్  ఇదేనన్న ఈసీ
Follow us

|

Updated on: Mar 17, 2020 | 12:53 PM

Andhra local polls row reaching its peak: ఏపీలో లోకల్ పోల్స్‌పై చెలరేగిన రచ్చ మరో లెవెల్‌కు చేరింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా చెల్లదంటున్న ప్రభుత్వం… రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఒత్తిడి తెస్తుంటే.. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తన నిర్ణయానికి కట్టుబడి వుంటానని మరింత గట్టిగా చాటారు. గతంలో ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలంటూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌కు లేఖరాస్తే.. దానికి మరింత ఘాటుగా స్పందించారాయన.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకే కట్టుబడి వుంటానని చాటుతూ.. తన నిర్ణయం వెనుక లాజిక్‌లను వివరిస్తూ.. రమేశ్ కుమార్ మంగళవారం సీఎస్‌కు లేఖ రాశారు. పూర్తి కారణాలతో కూడిన 3 పేజీల లేఖను సీఎస్‌కు పంపారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేసిన విషయం ఆయన తన లేఖలో ప్రస్తావించారు.

ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని లేఖలో సూచించిన రమేష్ కుమార్.. గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారని, కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదని రమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలను, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తీసుకుందని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సీఎస్, ఎస్ఈసీల మధ్య కొనసాగుతున్న లేఖాస్త్రాలతో స్థానిక సంస్థల వాయిదా వ్యవహారం మరింత జఠిలమైనట్లు కనిపిస్తోంది.