పంచాయతీరాజ్‌ అధికారులపై ఎస్‌ఈసీ చర్యలు, గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొరడా..

పంచాయతీరాజ్‌ అధికారులపై ఎస్‌ఈసీ చర్యలు, గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై బదిలీ వేటు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 26, 2021 | 12:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొరడా ఝలిపించారు. అందరూ ఊహించినట్టుగానే పంచాయతీరాజ్‌ శాఖ అధికారులపై ఎస్‌ఈసీ చర్యలు చేపట్టింది.

సీనియర్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్‌ఈసీ బదిలీ వేటు వేసింది. ఓటర్ల జాబితా రూపొందించడంలో నిర్లక్ష్యం వహించారంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 3.60 లక్షల మంది ఓటు హక్కుకు దూరమయ్యారని ఎస్‌ఈసీ పేర్కొంది. అధికారుల తప్పిదాలను సర్వీస్‌ రికార్డుల్లో పొందుపర్చాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బదిలీ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

అయితే ఇదే అంశంపై గుంటూరుకు చెందిన అఖిల అనే విద్యార్థిని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పాత ఓటరు లిస్టు ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తే కొత్తగా ఓటు హక్కు పొందిన అనేక మంది పోలింగ్‌కు దూరమవుతారని పిటిషన్‌లో పేర్కొంది. ఈ నెల 27 ఆ పిటిషన్‌పై విచారించనుంది హైకోర్టు.