ఏపీ గ‌వ‌ర్న‌ర్‌తో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ భేటీ.. ఎన్నిక‌ల‌కు పూర్తిగా స‌హ‌క‌రించేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని విన‌తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పీడ్‌ పెంచారు. ఎన్నిక‌ల‌ నిర్వహణ సజావుగా సాగేందుకు గవర్నర్‌..

ఏపీ గ‌వ‌ర్న‌ర్‌తో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ భేటీ.. ఎన్నిక‌ల‌కు పూర్తిగా స‌హ‌క‌రించేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని విన‌తి
Follow us

|

Updated on: Jan 27, 2021 | 12:01 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పీడ్‌ పెంచారు. ఎన్నిక‌ల‌ నిర్వహణ సజావుగా సాగేందుకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఎస్‌ఈసీ భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు గ‌వ‌ర్న‌ర్‌తో చర్చించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు.

ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నిక‌ల‌కు పూర్తిగా స‌హ‌క‌రించేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను ఎస్ఈసీ కోరారు. ఓటరు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణ చర్యలపౌ కూడా గవర్నర్‌కు ఎస్‌ఈసీ వివరించినట్లు సమాచారం.

ఇక ప్రభుత్వం తొలి నుంచి అభ్యంతరం చెబుతున్న కరోనా వ్యాప్తి అంశాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుని అందుకు గల ఏర్పాట్లపై గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు అమలు, భౌతిక దూరం పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొనడం.. శానిటేషన్‌ ప్రక్రియ.. వంటి చర్యలు గవర్నర్‌కు నిమ్మగడ్డ వివరించారు.

స్థానిక సంస్థ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఏపీ సీఎస్ లేఖ.. ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదంటూ.!