Panchalingala Checkpost: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద ఎస్ఈబీ అధికారుల తనిఖీలు.. కారులో ఉన్నది చూసి షాకైన అధికారులు..

Panchalingala Checkpost: కర్నూల జిల్లా పంచాలింగాలలో భారీగా వెండి పట్టుబడింది. దాదాపు 105 కేజీల వెండిని అధికారులు సీజ్ చేశారు.

Panchalingala Checkpost: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద ఎస్ఈబీ అధికారుల తనిఖీలు.. కారులో ఉన్నది చూసి షాకైన అధికారులు..
Follow us

|

Updated on: Jan 28, 2021 | 3:57 PM

Panchalingala Checkpost: కర్నూల జిల్లా పంచాలింగాలలో భారీగా వెండి పట్టుబడింది. దాదాపు 105 కేజీల వెండిని అధికారులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో వెండి పట్టుబడటంతో అధికారులు షాక్ అయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం నాడు కర్నూలు పట్టణానికి సమీపంలో గల పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అదికారులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఆ సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన కారును అధికారులు ఆపి తనిఖీలు చేశారు.

కారులో 105 కేజీల బంగారం తరలించడాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు కారును, అందులోని మనుషులను అదుపులోకి తీసుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 105 కేజీల వెండితో పాటు.. రూ. 2 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వెండిని హైదరాబాద్ నుంచి తమిళనాడులోని సేలం కు తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి కారును సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Anchor Pradeep: ‘ప్రతిరోజూ ఆ భయంతోనే షూటింగ్‌కు వెళ్లేవాడిని’… హీరోగా తొలి సినిమాపై స్పందించిన యాంకర్ ప్రదీప్..

Madanapalle murders: అలేఖ్య తన పేరును ఆ రోజున ‘మోహిని’గా మార్చికుంది.. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు