Breaking News
  • చిత్తూరు: మదనపల్లెలో మహిళా సంఘాల ఆందోళన. నిందితుడిని ఉరి తీయాలంటూ చిన్నారి వర్షిత తల్లిదండ్రుల ధర్నా. తమకు న్యాయం చేయాలంటున్న వర్షిత తల్లిదండ్రులు. రఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన వర్షిత కుటుంబ సభ్యులు. కిందకు దించేందుకు పోలీసుల ప్రయత్నాలు.
  • వివాదంలో జార్జిరెడ్డి సినిమా. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపణ. సినిమాలో జార్జిరెడ్డి రౌడీయిజాన్ని చూపెట్టాలన్న ఏబీవీపీ. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు. ఈ నెల 22న విడుదల కానున్న జార్జిరెడ్డి.
  • వరంగల్‌: ఏనుమాముల మార్కెట్ యార్ట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. ప్రభుత్వ హామీతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించిన కాటన్ వ్యాపారులు.
  • ఢిల్లీ చేరుకున్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. సా.4గంటలకు సోనియాతో భేటీ కానున్న శరద్‌పవార్‌. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • హైదరాబాద్‌: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ. తాకట్టు పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లు. సంవత్సరం గడిచినా కొనుగోలుదారులకు అందని కన్‌ఫర్మేషన్‌ ఆర్డర్. కన్‌ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరిన బ్యాంకర్లు. డిసెంబర్‌ 5న మరోసారి విచారిస్తామన్న హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా.
  • లోక్‌సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేశినేని నాని ప్రశ్న. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి-కేశినేని నాని. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది-కేశినేని నాని. పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న సభ. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నాం-మంత్రి పోఖ్రియాల్‌.
  • ఆగ్రా జిల్లా పేరు మార్చే యోచనలో యూపీ సర్కార్. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యూపీ సర్కార్‌ యోచన. కాషాయికరణలో భాగంగా పేరు మారుస్తున్నారని విపక్షాల విమర్శలు. గతంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన యూపీ సర్కార్.

వర్షంలో తడుస్తున్నారా? అయితే ఇలా చేయండి..

seasonal diseases causes and precautions

వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు అధికంగా వస్తుంటాయి. జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడటం సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అధికంగా వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. మరి వర్షకాలంలో ఎలాంటి జగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలమో చూద్దాం.

ప్యూరిఫైడ్‌ వాటర్‌:

వర్షాకాలంలో మనం తాగే నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండర్‌గ్రౌండ్ నుంచి వచ్చేపైప్‌లైన్ లీకేజీతో ఈ సమస్య పొంచి ఉంటుంది. అందుకోసం నీటిని కాచి చల్లార్చి తాగడం అలవాటు చేసుకోవాలి. లేదంటే ప్యూరిఫైడ్ నీటిని తీసుకోవాలి. నీటి ద్వారానే వర్షాకాలంలో చాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా జలుబు, గొంతునొప్పి, కడుపునొప్పి, వాంతులు,విరోచనాలు, పచ్చకామెర్లు వంటి వ్యాధులన్నీ నీటితోనే వ్యాప్తి చెందుతాయి.

పరిసరాల పరిశుభ్రత:

ఈ సీజన్‌లో అంటువ్యాధులు ఎక్కవగా వస్తాయి. దోమకాటుతో మలేరియా, ఫైలేరియా, ప్రమాదకరమైన డెంగ్యూ వంటి వ్యాధులు దోమకాటుతోనే వస్తాయి. దీనికోసం మన ఇళ్లల్లో దోమలు ఆవాసం ఏర్పరచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడబడితే అక్కడ చెత్తా చెదారంతో నింపితే దోమలు అక్కడ వాలి పై వ్యాధులకు కారణమవుతాయి.
దోమలు అధికంగా ఉన్నప్రాంతాల్లో వ్యాధులు ఎక్కువగా వచ్చేఅవకాశాలున్నాయి. ముఖ్యంగా మలేరియా. ఇది వైరల్ ఫీవర్‌కు దారితీస్తుంది. మన ఆరోగ్యశాఖ హెచ్చరికరల్నిబట్టి మన దేశంలో ప్రతిఏడాది మలేరియాతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది.

డయేరియా:

పరిసరాలు శుభ్రంగా లేకుంటే విరేచనాలు, వాంతులు, డయేరియా లక్షణాలు కనిపిస్తాయి. వర్షాకాలం కలుషిత నీరు, కలుషిత ఆహార పదార్థాల కారణంగా నీళ్ల విరోచనాల వ్యాధి కూడా రావచ్చు. ప్రధానంగా అలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కాచి వడబోసిన నీటినే తాగాలి. ఆహార పదార్థాలపై మూత పెట్టి ఉంచడం మరిచి పోకూడదు.

టైఫాయిడ్‌:

వర్షాకాలంలో టైఫాయిడ్‌ జ్వరం కూడా ఎక్కువగానే ఉంటుంది. కలుషిత ఆహారం, నీటి ప్రభావంవల్ల ఇనఫెక్షన సోకి జ్వరం వస్తుంది. తగ్గకుండా చాలా రోజులు బాధిస్తుంది. దాంతో పాటు కడుపునొప్పి, డయేరియా, తలనొప్పి వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం ఎక్కువ రోజులు తగ్గకపోయినా టైఫాయిడ్‌ అని అనుమానం వచ్చినా, వీలైనంత తొందరగా డాక్టర్‌ను సంప్రదించడం మేలు. టైఫాయిడ్‌ వచ్చిన వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముందు జాగ్రత్తగా పిల్లలకు చిన్నతనంలోనే టీకా వేయించాలి. టైఫాయిడ్‌ వచ్చిన వారు అప్పటికప్పుడు వండిన ఆహారపదార్థాలు మాత్రమే తినాలి. బయటి ఆహారం తినకూడదు. అలాగే ఈకాలంలో ఆకుకూరలు మానేస్తే మంచిది. దంతధావనం, స్నాన సమయాల్లో నీటిని మింగేయకూడదు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

చలి,సైనస్‌:

వర్షంలో ఒక్కసారి తడిస్తే చాలు, చాలామందికి జలుబు వస్తుంది. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. సైనస్‌ వస్తే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో వర్షంలో తడవకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ తడిస్తే వెంటనే తల, ఒళ్లు తుడుచుకుని పొడి దుస్తులు మార్చుకోవాలి. వేడిపాలల్లో పసుపు వేసుకుని తాగడం, నువ్వులు, బెల్లంలాంటివి ఆహారంలో భాగం చేసుకోవడం, వేడినీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం, ముఖానికి నీటి ఆవిరి పట్టడం వల్ల ఉపశమనం ఉంటుంది. టాయ్‌లెట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ సీజనలో మహిళలు యూరినరీ ఇన్ఫెక్షనకి గురయ్యే ప్రమాదం అధికంగా ఉంది గనుక నీరు ఎక్కువ తాగాలి.

వీటితో పాటు పలు జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.