Missing Indonesian Flight: ఇండోనేషియాలో 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం జనవరి 9న అదృశ్యమై సముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే విమానం కూలిపోయినప్పటి నుంచి గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో మృతులు, విమాన శకలాలను గుర్తించేందుకు అక్కడి ప్రభుత్వం అన్వేషన కొనసాగిస్తోంది అక్కడి ప్రభుత్వం . శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ విమానం నుంచి విడిపోయిన కాక్‌పిట్ వాయిస్ రికార్డు కోసం డ్రైవర్లు థౌజెండ్ ఐలాండ్‌లోని జావా సముద్ర తీర ప్రాంతాల్లో గాలింపును ముమ్మరం చేశారు సహాయక సిబ్బంది. మరోవైపు మంగళవారం రోజు విమానంలో డేటాతో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని విమాన శకలాలు, మానవ అవశేషాలను సహాయక సిబ్బంది గుర్తించారు.
కాగా, విమానం గాలింపు కోసం తీవ్ర ప్రాంతాల్లో అన్వేషణను మరింతగా పెంచినట్లు రెస్క్యూ మిషన్ బృందం తెలిపింది. సముద్ర ప్రవాహంలో విమాన శిథిలాలు, బాధితులను గుర్తించే వీలుంటుందని తెలిపింది. ఈ గాలింపు కోసం 4100 మంది సహాయక సిబ్బంది, 13 హెలికాప్టర్లు, 55 ఓడలు, 18 రాఫ్ట్ బోట్లను రంగంలోకి దింపినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 141 మానవ అవశేషాలతో కూడిన బ్యాగులను పోలీస్ ఐడెంటిఫికేషన్ ఎక్స్ఫర్ట్లకు పంపారు. అలాగే ప్రభుత్వం విపత్తు బాధిత గుర్తింపు కేంద్రం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఫ్లైట్ అటెండెంట్, ఆఫ్ డ్యూటీ ఫైలట్‌తో పాటు మొత్తం ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు ఆ కేంద్ర అధికారులు వెల్లడించారు.
ప్రమాదానికి గురైన బోయింగ్ 735-500 విమానంలో ఇద్దరు పైలట్లు కూడా అనుభవం ఉన్నవారేనని శ్రీవిజయ విమానయాన సంస్థ తెలిపింది. కెప్టెన్ అఫ్వాన్ ఎయిర్‌ఫోర్స్ హెర్క్యులెస్ పైలట్‌గా తన కెరీర్ ప్రారంభించారని, ఆయనకు కొన్ని దశాబ్దాల అనుభవం ఉందని తెలిపింది. అలాగే కో-పైలట్ డియాగో మమహిట్‌కు కూడా అంతే అనుభం ఉందని శ్రీవిజయ విమానయాన సంస్థ పేర్కొంది.