ప్రాణాలు తీసిన అతివేగం.. ముగ్గురు మృతి..

, ప్రాణాలు తీసిన అతివేగం.. ముగ్గురు మృతి..

అతివేగం మూడు ప్రాణాలను బలికొంది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం విటంరాజు పల్లె వద్ద వేగంగా వెళుతున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌, రామకృష్ణ, వెంకటేశ్‌, కుమారస్వామి స్కార్పియోలో ప్రకాశం జిల్లా మార్కాపురం వైపు వెళుతున్నారు. విటంరాజుపల్లె వద్దకు చేరుకునేసరికి వీరి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చింతచెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్‌, రామకృష్ణ, వెంకటేశ్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వినుకొండ సీఐ ఎం.సుబ్బారావు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *