మంచు పర్వతాల్లో ‘ ప్లాస్టిక్ భూతం ‘.. డేంజర్లో పర్యావరణం

  ప్లాస్టిక్ ని నిషేధించాలంటూ ఓ వైపు పర్యావరణవేత్తలు గొంతు చించుకుంటుంటే..మరోవైపు ప్రపంచ దేశాలు దీనిపై నిమ్మకు నీరెత్తినట్టు మౌనం వహిస్తున్నాయి. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికే కాదు.. మానవుల ఆరోగ్యానికీ చేటే అన్నది నిర్వివాదాంశం. తాజాగా జర్మనీకి చెందిన శాస్త్రజ్ఞులు కొందరు ఆల్ప్స్ పర్వతాలు, ఆర్కిటిక్ ప్రాంతంలోని స్నో (మంచు) సాంపిల్స్ లో మైక్రో ప్లాస్టిక్ ని కనుగొని ఆశ్చర్యపోయారు. ప్లాస్టిక్ కేవలం భూముల్నే కాదు.. […]

మంచు పర్వతాల్లో ' ప్లాస్టిక్ భూతం '.. డేంజర్లో పర్యావరణం
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2019 | 3:45 PM

ప్లాస్టిక్ ని నిషేధించాలంటూ ఓ వైపు పర్యావరణవేత్తలు గొంతు చించుకుంటుంటే..మరోవైపు ప్రపంచ దేశాలు దీనిపై నిమ్మకు నీరెత్తినట్టు మౌనం వహిస్తున్నాయి. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికే కాదు.. మానవుల ఆరోగ్యానికీ చేటే అన్నది నిర్వివాదాంశం. తాజాగా జర్మనీకి చెందిన శాస్త్రజ్ఞులు కొందరు ఆల్ప్స్ పర్వతాలు, ఆర్కిటిక్ ప్రాంతంలోని స్నో (మంచు) సాంపిల్స్ లో మైక్రో ప్లాస్టిక్ ని కనుగొని ఆశ్చర్యపోయారు. ప్లాస్టిక్ కేవలం భూముల్నే కాదు.. సముద్రాలు, (నీటిని), చివరకు గాలిని కూడా కలుషితం చేస్తోందని ఈ రీసెర్చర్లు చెబుతున్నారు. అసలు మైక్రోప్లాస్టిక్స్ అంటే ? ఇవి ప్లాస్టిక్ లోని అతి చిన్న భాగాలు.. చాలాకాలం కిందటే వాతావరణంలో కలసిపోయిన దాదాపు శిథిలాల వంటివాటినుంచి వెల్లువెత్తిన సూక్ష్మ భాగాలే ఇవి ! కరుగుతున్న ఆర్కిటిక్ మంచులో లీటరుకు 14, 400 మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ని తాము కనుగొన్నామని జర్మనీ రీసెర్చర్ల బృందానికి నాయకత్వం వహించిన గునార్ గెర్డ్ తెలిపారు. అసలు మానవ ఆవాసాలే కనిపించని ఈ మంచు పర్వతాల్లో ఇన్ని మైక్రో ప్లాస్టిక్స్ కనబడడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అసలివి ఎక్కడినుంచి వచ్చాయని తాము ప్రశ్నించుకున్నప్పుడు.. బహుశా నీరు లేదా గాలి నుంచి వ్యాపించి ఉండవచ్చునని తామంతా అభిప్రాయపడ్డామన్నారు. ఇరాన్, చైనా యూరప్ తదితర దేశాల్లో గతంలో జరిపిన పరిశోధనల్లోనూ మైక్రోప్లాస్టిక్స్ కనుగొన్నప్పటికీ.. నిర్మానుష్యమైన ఈ ప్రాంతంలో వీటి జాడ కనబడడమే విశేషం.. ఇవి వర్షపు నీటి ద్వారా కూడా ఇక్కడ చేరి ఉండవచ్ఛు అన్నారాయన. కాగా-మనం తినే ఆహారంలో మనకు తెలియకుండానే ఇవి కలిసిపోతున్నాయని, పీల్చే గాలిలోనూ ఇవి ఉంటున్నాయని గునార్ అభిప్రాయపడ్డారు. అందువల్లే ఒక్కోసారి శ్వాస పీల్చడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఫైబ్రోసిస్ వంటి వ్యాధులు కూడా సోకుతున్నాయని ఈ పరిశోధకుల బృందం తమ అధ్యయన పత్రంలో పేర్కొంది. ఇప్పటికైనా ప్లాస్టిక్ నిషేధంపై ప్రపంచ దేశాలు గట్టిగా చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. Micro Plastics 2

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!