బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ.. తెరపైకి కొత్త వాదన

Bermuda Triangle, బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ.. తెరపైకి కొత్త వాదన

ప్రపంచంలో వీడని మిస్టరీలలో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ. అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూరో రిక్టో మద్యన 7లక్షల చదరపు కిలోమేటర్ల మేర ఇది విస్తరించి ఉంది. డెవిల్ ట్రయాంగిల్‌గా పేరున్న ఈ ప్రదేశానికి దగ్గరగా వెళ్లే పెద్ద పెద్ద ఓడలే కాదు.. దాని పైన వెళ్లే విమానాలు సైతం అదృశ్యమవుతాయి. గత వందేళ్లలో అటుగా వెళ్లిన సుమారు 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి. అయితే అవన్నీ అదృశ్యమవ్వడం వెనుక శాస్త్రవేత్తలు పలు రకాలు వాదనలు వినిపించారు. ఆ ప్రాంతంలో అగ్ని బిలాల వలనే ఇలా జరుగుతున్నాయని.. ఏలియన్లే అటుగా వెళ్తోన్న నౌకలు, విమానాలను నాశనం చేస్తున్నాయని.. సముద్రంలో పిరమిడ్లు ఉండటం వల్లే ఇలా జరుగుతుందని.. ఆ ప్రాంతంలో భూమాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతుందని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. కాగా తాజాగా ఈ మిస్టరీపై నమ్మశక్యమైన కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు యూనివర్సిటీ ఆఫ్ సౌతంఫ్టన్ రీసెర్చర్ డాక్టర్ సిమన్ బాక్సల్.

Bermuda Triangle, బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ.. తెరపైకి కొత్త వాదన

ఆ ప్రదేశంలో ఉత్తర, దక్షిణాల నుంచి వచ్చే ఉద్రిక్త అలలకు తోడు ఫ్లోరిడా నుంచి వచ్చే భారీ అలల వలన రోగ్ వేవ్స్ ఏర్పాడుతాయని దాని వలనే భారీ ఓడలు సైతం అక్కడ అదృశ్యమవుతున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ రోగ్ వేవ్స్ వంద అడుగుల ఎత్తుకు ఎగిసిపడతాయని అందుకే విమానాలు సైతం అక్కడ గల్లంతవుతున్నాయని సిమన్ బాక్సల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ డాక్యుమెంటరీని కూడా ఆయన విడుదల చేశారు. కాగా ఆయన చెప్పిన దాంట్లో నిజమెంతుందో తెలీదు కానీ నమ్మశక్యంగా మాత్రం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *