హడావిడి షురూ..!

వేసవి సెలవులు ముగిశాయి. పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళే మొదలవుతుండడంతో రోడ్లపై మళ్లీ హడావిడి మొదలైయింది. ఇక తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ సెలవులపై కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసింది. స్కూల్స్ సెలవులు, ప్రారంభ తేదీలను మళ్లీ పాత విధానంలోనే నిర్దేశిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 237 రోజుల పాటు స్కూల్ డేస్ ఉంటాయి. లాస్ట్ వర్కింగ్ […]

హడావిడి షురూ..!
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2019 | 9:48 AM

వేసవి సెలవులు ముగిశాయి. పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళే మొదలవుతుండడంతో రోడ్లపై మళ్లీ హడావిడి మొదలైయింది.

ఇక తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ సెలవులపై కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసింది. స్కూల్స్ సెలవులు, ప్రారంభ తేదీలను మళ్లీ పాత విధానంలోనే నిర్దేశిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 237 రోజుల పాటు స్కూల్ డేస్ ఉంటాయి. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ తేదీ. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. పదో తరగతికి జనవరి నాటికి, మిగిలిన తరగతులకు ఫిబ్రవరి 29 నాటికి సిలబస్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్రీడా పోటీలు కూడా ఆగష్టు 1, 2 వారాల్లో ప్రారంభించి.. రాష్ట్రస్థాయిలో సెప్టెంబర్ 4వ వారం కల్లా పూర్తి చేయాలని కోరింది.

కాగా..తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలలను పున: ప్రారంభించాలని గతంలో నిర్ణయించారు. దీంతో వేసవి సెలవులను ముందుగానే ఇచ్చారు. ఈ సంవత్సరం ఎండలు తీవ్రస్థాయిలో ఉండడంతో జూన్ 11వ తేదీ వరకు సెలవులను పొడిగించింది సర్కార్.