వర్షాల ధాటికి కుప్పకూలిన సుల్తాన్ బజార్ గవర్నమెంట్ స్కూల్

హైదరాబాద్ న‌గ‌రంలో చరిత్ర కలిగిన పాఠశాల భవనం కుప్పకూలింది. గ‌త కొన్నిరోజులుగా కురుస్తున్న వాన‌ల‌తో పాఠ‌శాల భ‌వ‌నం దెబ్బతిన్నది. సుల్తాన్ బ‌జార్‌లోని పాతకాలం నాటి ప్రభుత్వ పాఠ‌శాల భ‌వ‌నం బుధ‌వారం రాత్రి కూలిపోయింది.

వర్షాల ధాటికి కుప్పకూలిన సుల్తాన్ బజార్ గవర్నమెంట్ స్కూల్
Follow us

|

Updated on: Aug 27, 2020 | 3:57 PM

హైదరాబాద్ న‌గ‌రంలో చరిత్ర కలిగిన పాఠశాల భవనం కుప్పకూలింది. గ‌త కొన్నిరోజులుగా కురుస్తున్న వాన‌ల‌తో పాఠ‌శాల భ‌వ‌నం దెబ్బతిన్నది. సుల్తాన్ బ‌జార్‌లోని పాతకాలం నాటి ప్రభుత్వ పాఠ‌శాల భ‌వ‌నం బుధ‌వారం రాత్రి కూలిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్‌, మాన్‌సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరి శిధిలాల‌ను తొల‌గించాయి. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌టంతో పెను ప్రమాదం తప్పింది. అదీ రాత్రి స‌మ‌యం కావ‌డంతో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని జీహెచ్ఎంసీ అధికారులు వెల్ల‌డించారు. మరోవైపు, హైదరాబాద్ మహాన‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఈరోజు భారీ వాన‌లు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని వాతావరణ శాఖ తెలిపింది. సిటీలోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇక, ఇప్పటికే నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా తొలగించుకోవాలని కోరారు.